Industrial Park | నా భర్త, ఇద్దరు కొడుకులు చనిపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నా భూమి గుంజుకుంటా అంటున్నాడని పరిగి మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణలో భూమి కోల్పోతున్న బాధితురాలు వాపోయింది. ఇంటికి మగదిక్కు లేకుండా పోయింది.. ఇల్లు భారమంతా నామీద ఉంది.. రేవంత్ రెడ్డికి ఓటేయ్యమంటే వేసినం. ఇట్ల చేస్తడని అనుకున్నమా.. ? వానింట్ల మన్ను వొయ్య.. వానింట్ల పీనుగెల్లా.. అట్లే పోయి వాడిని ఆడనే చంపుడ్రి. మేం కూడా తడ్లాడుకుంటనైనా ఆడికొస్తమంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ముసలవ్వ తీవ్రస్థాయిలో మండిపడ్డది.
నాకు భయం లేదు. వాడు చావాలి. నా భూమి కోసమే ఇక్కడిదాకా నడుచుకుంటూ వచ్చిన. ఇద్దరు పిల్లలను చూస్తే మీరు చెప్తరు. తండ్రులు లేని పిల్లలు.. ఇద్దరు కొడుకులు లేకపాయె. ఇంకేం చేస్తాం.. నేను, నా కోడళ్లు ముగ్గురం. ఇద్దరు పిల్లలు. ఆడపిల్లలకు ఇస్తా అన్న రూ.2500, పెన్షన్ 4000 లే ఇస్తలే. ఇంకేం ఇస్తడు. ఈ కాపోళ్లతో ఇయ్యాళ పోతం, రేపు పోతం.. భూములు రేపుండయ్. మళ్లా పోతమా..? అని ఆవేదన వ్యక్తం చేసింది. అయిపోతది.. ఇంకేడ బతుకతం మేం. ఏన్నన్నా ఇంత మందు తెచ్చుకుంటం.
చేన్ల దగ్గర కూర్చొని తాగుతం. కొడుకులు ఇద్దరు పోయిర్రు. నాకిప్పుడు ఎవడు గంజి పోస్తడు. కోడళ్లను, పిల్లలను అందరినీ నేనే చూసుకుంటున్నా. కాపోళ్ల దగ్గరు బిచ్చం అడుక్కొచ్చుకుని ఈ బువ్వ పెట్టుకుంటున్నానంటూ కన్నీటి పర్యంతమైంది.
నా భర్త, ఇద్దరు కొడుకులు చనిపోయారు.. ఇప్పుడు రేవంత్ రెడ్డి నా భూమి గుంజుకుంట అని అంటున్నాడు
నా భూమి తీసుకుంటే నేను, నా కోడళ్ళు, పిల్లలు అందరం మందు తాగి సచ్చిపోతాం
మాకు పైసలొద్దు.. మా భూమి మాకు కావాలి అంటూ కంటతడి పెట్టుకున్న పరిగి ఇండస్ట్రియల్ పార్క్ బాధితురాలు https://t.co/ABpBlfnofk pic.twitter.com/QAIx0QuHha
— Telugu Scribe (@TeluguScribe) March 11, 2026
Vadhala Movie | జగపతి బాబు ‘వదలా’ గ్లింప్స్ విడుదల.. ఆకట్టుకుంటున్న సస్పెన్స్ థ్రిల్లర్!
Ek Din Trailer | ఆమిర్ ఖాన్ తనయుడితో సాయి పల్లవి రొమాన్స్.. ‘ఏక్ దిన్’ ట్రైలర్ విడుదల