BRS Rajatotsava Sabha | రాయపోల్, ఏప్రిల్ 17 : ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని బీఆర్ఎస్ నియోజకవర్గ సీనియర్ నాయకుడు, దౌల్తాబాద్ మండల మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సర్వు గారి యాదవ రెడ్డి పిలుపునిచ్చారు.
ఇవాళ ఆయన తిరుమలాపూర్లో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి.. గత పది సంవత్సరాలు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందించి రాష్ట్రానికి దేశంలోనే నెంబర్ వన్‌గా గుర్తింపు తెచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలల పాలనలో ప్రజలు, రైతులు హరిగోస పడుతున్నట్ల ఆయన గుర్తు చేశారు. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు నిర్బంధాలతో బీఆర్ఎస్ శ్రేణులను భయపట్టేందుకు పాల్పడుతుందని ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు కొత్తకాదనీ.. ఉద్యమాల నుంచి వచ్చిన పార్టీ అని పోరాటాలు ప్రజా ఉద్యమాల గడ్డ దుబ్బాక నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వరంగల్ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ సొంత సర్వేలో మళ్లీ కేసీఆర్ రావాలని తేలిపోయింది..
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసుగెత్తిపోయారని.. ఆ పార్టీ సొంత సర్వేలో మళ్లీ కేసీఆర్ రావాలని తేలిపోయిందన్నారు యాదవ రెడ్డి. ఈ సర్వేతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఆదరణ కోల్పోయిందన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు నిరసనగా ఈనెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కేసీఆర్ హాజరవుతున్నారని.. గ్రామ గ్రామాన గులాబీ సైనికులు దండులా బయలుదేరాలని కోరారు. సభను విజయవంతం చేసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ సత్తాను చాటిచెప్పి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పే విధంగా సభను జయప్రదం చేయాలని పేర్కొన్నారు.
Minister Ponguleti | భూ వివాదాలు లేని రాష్ట్రంగా భూ భారతి చట్టం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Amit Shah: సీఆర్పీఎఫ్ 86వ రైజింగ్ డే.. 2026 నాటికి నక్సలిజం ఇక చరిత్రే: అమిత్ షా
Illegally Sand | అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను సీజ్ చేసిన తహసీల్దార్ అనిత