రాజాపేట ఏప్రిల్ 17 : అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 3 వందల ట్రిప్పుల ఐదు ఇసుక డంపులను రాజాపేటలో గురువారం తసిల్దార్ అనిత సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని మణికంఠ రైస్ మిల్ పక్కనే ఎలాంటి అనుమతి లేకుండా భారీగా ఇసుక డంపులు ఉన్నాయని తెలిపారు. ఇసుక డంపులను పరిశీలించి ఎలాంటి అనుమతి లేకపోవడంతో సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. నిబంధనల మేరకే ఇసుక కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు. ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Phule Movie | ‘ఫూలే’ సినిమా వివాదం.. సెన్సార్ బోర్డ్‌పై నిప్పులు చెరిగిన అనురాగ్ కశ్యప్
Trump Tariffs | చైనాపై 245 శాతం టారిఫ్.. అమెరికా బెదిరింపులకు భయపడేది లేదంటున్న డ్రాగన్