UP Horror | ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన (UP Horror) చోటు చేసుకుంది. ఓ బధిర (చెవిటి, మూగ) బాలిక అత్యాచారానికి గురైంది. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న ఆ బాలికను గ్రామస్థులు గుర్తించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన రాంపూర్ (Rampur) జిల్లాలో చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఎన్కౌంటర్ చేసి మరీ నిందితుడిని పట్టుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 11 ఏళ్ల బాలిక మంగళవారం రాత్రి సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో గ్రామస్థుల సాయంతో కుటుంబ సభ్యులు బాలిక కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్రంగా గాలించారు. అయినా బాలిక జాడ కనిపించలేదు. బుధవారం ఉదయం గ్రామ సమీపంలోని ఓ పొలంలో బాలిక నగ్నంగా, అపస్మారక స్థితిలో కనిపించింది. దీంతో ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మీరట్‌కు తీసుకెళ్లారు.
ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. అదే గ్రామానికి చెందిన డాన్ సింగ్ (24) అనే యువకుడు బాలికను తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు సైతం ఎదురు కాల్పులకు దిగడంతో నిందితుడి కాలికి బుల్లెట్ గాయమైంది. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also Read..
Robert Vadra | వరుసగా మూడో రోజు ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా