Donald Trump : పశ్చిమాసియాలోని ఇరాన్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కి మరో షాక్ తగలనుంది. ప్రపంచక ఫుట్‌బాల్ సమాఖ్య(FIFA) ఆయనపై నిషేధం విధించాలనే ఆలోచనతో ఉంది. పిఫా వరల్డ్‌కప్ పోటీలతో పాటు లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ 2028కు హాజరవ్వకుండా ట్రంప్‌పై నిషేధం పడే అవకాశముంది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థకు చెల్లించాల్సిన బకాయిలు భారీగా పేరుకుపోవడమే అందుకు కారణమని సమాచారం.
గత కొన్నేళ్లుగా యూఎస్ఏ ప్రభుత్వానికి, ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థకు పొసగడం లేదు. దాంతో.. మూడేళ్ల నుంచి వాడాకు యూఎస్ ప్రభుత్వం ఒక్క డాలర్ కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం యూఎస్ఏ చెల్లించాల్సిన బకాయిల మొత్తం 7.3 మిలియన్ డాలర్ల(రూ.67 కోట్లకు పైగా)గా ఉన్నాయి. దాంతో.. వాడాకు బాకీపడిన దేశాలకు చెందిన అధ్యక్షులను, ప్రతినిధులను ఒలింపిక్స్, వరల్డ్ ఛాంపియన్షిప్స్ వంటి ప్రధాన క్రీడలకు, స్పోర్ట్స్ ఈవెంట్లకు అనుమతించకూడదనే ప్రతిపాదన ఉంది.
WADA to mull rule changes that could bar Donald Trump, US officials from LA Olympics and possibly FIFA World Cup over unpaid dues https://t.co/wDMbBif8su
— The Indian Express (@IndianExpress) March 14, 2026
కాబట్టి.. ఫిఫా వరల్డ్‌కప్‌తో పాటు లాస్ ఎంజెలెస్ ఒలింపిక్స్‌లో ఈవెంట్లో పాల్గొనకుండా అమెరికా అధినేతపై నిషేధం విధించే అవకాశముందని సమాచారం. అయితే.. వాడా అధికార ప్రతినిధి జేమ్స్ ఫిట్జెరాల్డ్ మాత్రం అదేమీ లేదని అంటుండడం గమనార్హం.
జో బైడెన్ హయాం నుంచే వాడాపై అమెరికా కినుక వహిస్తోంది. డోపింగ్‌లో పట్టుబడిన ఆటగాళ్లను ఒలిపింక్స్ పోటీల్లో అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ వాడాకు నిధులు ఇవ్వడం ఆపేసింది యూఎస్ఏ. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కూడా ఈ విధానాన్నే అనుసరించడంతో వాడాకు అమెరికా నుంచి డాలర్లు ముట్టడం లేదు. 2014లో సోచి గేమ్స్‌కు ముందు రష్యా డోపింగ్ కుంభకోణంలో, పారిస్ ఒలింపిక్స్‌లో 23 మంది చైనా అథ్లెట్లు పట్టుడినా వాడా చర్యలు తీసుకోకపోవడమే అమెరికా ఆగ్రహానికి కారణం.
‘వాడా హెచ్చరికలు చేస్తున్నా సరే మా దేశం నిర్ణయంలో మార్పు ఉండదు. డోపింగ్ విషయంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం’ అని అమెరికా జాతీయ డ్రగ్స్ నియంత్రణ విధానం డైరెక్టర్ సారా కార్టెర్ ఒక ప్రకటనలో తెలిపారు.