BRS Party | ములుగు, ఏప్రిల్ 26 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే రాష్ట్రాభివృద్ది సాధ్యమని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జహంగీర్, డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి అన్నారు. ఇవాళ ములుగు మండల పరిధిలోని శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జి కొమ్ము నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం జహంగీర్, బట్టు అంజిరెడ్డి మాట్లాడుతూ.. మోసపూరిత వాగ్ధానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హమీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గడిచిన రెండేళ్లలో తీవ్ర వ్యతిరేకతను రేవంత్ సర్కార్ మూటకట్టుకున్నదన్నారు. ఏ గ్రామానికి వెళ్లి ప్రజలను పలుకరించినా కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ పట్ల పూర్తి విశ్వాసం చూపుతున్నారని అన్నారు. కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రజల మనస్సులో బీఆర్ఎస్ పార్టీ పట్ల, కేసీఆర్ పరిపాలన పట్ల సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ వింగ్ ఉపాధ్యక్షుడు జుబేర్‌పాషా, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నర్సంపల్లి అర్జున్‌గౌడ్, పెద్దబాల్ అంజన్‌గౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కుక్కల నరేశ్‌గౌడ్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ భూపాల్‌రెడ్డి, నాయకులు బొల్లెపల్లి బాలకృష్ణ, రవీందర్‌చారి, సుదర్శన్, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Palvancha : కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటున్న తెలంగాణ సమాజం : మాజీ మంత్రి వనమా
Amberpet | రజతోత్సవానికి రెడీ.. అంబర్‌పేటలో ముందే మురిసిన గులాబీ జెండా