Amberpet | రజతోత్సవానికి రెడీ.. అంబర్‌పేటలో ముందే మురిసిన గులాబీ జెండా
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి వెళ్తుందుకు అంబర్‌పేట (Amberpet) నియోజకవర్గం గులాబీ దండు సర్వం సిద్ధమైంది. ఆదివారం నియోజకవర్గం నుంచి కనీసం 4 వేల మందికి పైగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను తరలివెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు.
గోల్నాక, ఏప్రిల్ 26: వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి వెళ్తుందుకు అంబర్‌పేట (Amberpet) నియోజకవర్గం గులాబీ దండు సర్వం సిద్ధమైంది. ఆదివారం నియోజకవర్గం నుంచి కనీసం 4 వేల మందికి పైగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను తరలివెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మేరకు పార్టీ నాయకులు వాహనాలు, భోజనం ఇతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే అంబర్ పేట నియోజకర్గంలోని ప్రధాన ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లతో గులాబీమయంగా మారిపోయింది. దీంతో ఒక్క రోజు ముందే గులాబీ రెపరెపలతో బీఆర్ఎస్ జెండా మురిసింది..శనివారం అంబర్ పేట అలీకేఫ్ చౌరస్తా వద్ద ఘనంగా గులాబీ జెండా పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వందలాది మంది బీఆర్ఎస్ నాయకులతో కలసి హాజరైన ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వూసి నివాళుర్పించారు. అనంతరం బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించి భారీ కేక్ కట్ చేసి బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రజతోత్సవ భారీ బహిరంగ సభకు ఎవరెవరు ఎక్కడున్నా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
అంబర్ పేట గులాబీ దండు బలమెంతో చూపుతూ దారులన్ని ఎల్కతుర్తి వైపే సాగాలని ఆయన పిలుపు నిచ్చారు. అది చూసి కాంగ్రెస్ దిమ్మెతిరిగి పోవాలన్నారు. 25 ఏండ్లు తెలంగాణ హక్కులు, సమస్యలపైనే పోరాటం సాగించి సాధించుకున్న తెలంగాణాలో అన్ని వనరులు, వసతులు ఏర్పాటు చేసుకున్నామని ఆయన గుర్తు చేశారు. గత పదేండ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని, అభివృద్ధి, సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసి అన్ని వర్గాలకు అందించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎల్కతుర్తి రజతోత్సవ సభ వైపు యావత్ దేశం ఎదురు చూస్తోందని అన్నారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి సర్కార్‌పై ప్రజలకు నమ్మకం పోయిందని, కాంగ్రెస్ పాలనను చూసి తాము మోసపోయామని ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిన అనేక పథకాలు తమకు అందడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. కేసీఆర్ నాయకత్వాన్ని సబ్బండవర్గాలు కోరుకుంటున్నాయని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూసి మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ పాలనే కావాలంటున్నారని ఆయన అన్నారు. గత కేసీఆర్ పాలనను, నేటి పాలనను చూసి అర్థం చేసుకున్న ప్రజలు కేసీఆర్‌ను చూసేందుకు స్వచ్ఛందంగా సభకు తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రం తెచ్చిన నేతగా, 10 ఏండ్లు అభివృద్ధి చేసిన నాయకుడిగా కేసీఆర్ మాటలు వినేందుకు ప్రజలు ఆసక్తిగా ఉన్నారని ఆయన తెలిపారు. పదేండ్ల అనతికాలంలోనే తెలంగాణలో అద్భుతమైన ప్రగతిని సాధించుకున్నామని ఆయన గుర్తు చేశారు. గతంలో కంటే రెట్టింపు మద్దతుతో అధికారం వచ్చే రోజు త్వరలోనే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అంబర్ పేట నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి కలిసికట్టుగా రావాలన్నారు.అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేతలు శిరీషయాదవ్, ఓం ప్రకాశ్ యాదవ్, సిద్ధార్థ్ ముదిరాజ్, భూపతి లక్ష్మణ్, పులిజాల గెల్వయ్య, ఎర్రబోలు నరసింహరెడ్డి, మోర శ్రీరాములు ముదిరాజ్ తో పాటు భారీ ఎత్తున బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dandari celebrations | ఆదివాసి గుడేల్లో మార్మోగుతున్న దండారి వేడుకలు
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌పై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సస్పెన్షన్
Roshan Kanakala | మరో డిఫరెంట్ జానర్‌తో రాబోతున్న రోషన్ కనకాల.. ఈసారి వీఐ ఆనంద్ కథతో కొత్త ప్రయోగం!
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

