CMRF | రాయపోల్, మార్చి 23 : నిరుపేదలకు సీఎం సహాయ నిధి పథకం ఎంతో వరం లాంటిదని బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు హనుమండ్ల రాజిరెడ్డి అన్నారు. ఇవాళ మండల కేంద్రానికి చెందిన సంఘం కిషన్ దంపతులకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు రూ.10,500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. మండల కేంద్రానికి చెందిన సంఘం స్వరూప ఇటీవల అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో వైద్యానికి అయినటువంటి ఖర్చుల బిల్లులను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ మేరకు ఆయన సీఎం సహాయ నిధి నుండి బాధిత కుటుంబానికి చెక్కును ఇప్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ నాయకులు మదాసు మురళీ, మైనార్టీ నాయకుడు రఫీ తదితరులు పాల్గొన్నారు.
Hyderabad | ఎస్టీ హాస్టల్లో పురుగుల అన్నం.. రోడ్డెక్కిన విద్యార్థులు