MLC Kalvakuntla Kavitha | హనుమంతుడి దయవల్ల బీఆర్ఎస్పార్టీకి జయమే కలుగుతుంది: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
MLC Kalvakuntla Kavitha | ఇవాళ వర్గల్ మండలం నాచారంగుట్ట సమీపంలో వెలసిన ధ్యానాంజనేయస్వామి ఆలయ 4వ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన యజ్ఞ యాగ క్రతువులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అఖిలభారత హనుమాన్ దీక్షాపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ దుర్గాప్రసాద్స్వామిజీతో కలిసి పాల్గొన్నారు.
MLC Kalvakuntla Kavitha | వర్గల్,ఏప్రిల్20: హనుమాన్ అనుగ్రహంతోనే రాష్ట్రం సుభిక్షంగా ఉందని, మానసిక ప్రశాంతతకు నాచారం ధ్యానాంజనేయస్వామి ఆలయం తార్కాణంగా ఉందని తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు.
ఇవాళ వర్గల్ మండలం నాచారంగుట్ట సమీపంలో వెలసిన ధ్యానాంజనేయస్వామి ఆలయ 4వ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన యజ్ఞ యాగ క్రతువులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అఖిలభారత హనుమాన్ దీక్షాపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ దుర్గాప్రసాద్స్వామిజీతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆలయ వ్యవస్థాపకులు శ్రీ తాత నర్సింగారావు సువీశాల ప్రాంతంలో ధ్యానాంజనేయస్వామి ఆలయం నాచారంగుట్ట పరిధిలో నెలకొల్పడం హనుమాన్మాన భక్తులకు మహాభాగ్యం అన్నారు. దుర్గాప్రసాద్ స్వామిజీ ఆశీస్సులు, హనుమంతుడి దయవల్ల బీఆర్ఎస్ పార్టీకి ఎప్పటికీ జయమే కలుగుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితకు ఆలయం తరుపున పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, నాచారం ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి, ఆలయ సభ్యులు పంది నగేశ్తోపాటు పలువురు బీఆర్ఎస్పార్టీ నాయకులు పాల్గొన్నారు.


Read Also :
CC cameras | నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం
Indigo flight | విమానాన్ని ఢీకొట్టిన టెంపో ట్రావెలర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

