సిటీబ్యూరో, ఆగస్టు 14 ( నమస్తే తెలంగాణ ) :ప్రభుత్వం ఓ వైపు ఈవీ ఆటోలను ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంటే షోరూంలు మాత్రం బ్లాక్ మార్కెట్‌తో డబ్బులు దండుకుంటున్నాయని ఆటో డ్రైవర్ల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈవీ ఆటో బుక్ చేస్తే 2, 3నెలలైనా రావడం లేదంటూ తెలిపారు. ప్రతీ ఆటోపై 2 లక్షల వరకు అధికంగా వసూలు చేస్తున్నారని టీఏడీఎస్ ప్రెసిడెంట్ సత్తిరెడ్డి అన్నారు.
ఈవీ ఆటో కొనుగోలులో ఎలాంటి నిబంధనలు లేకుండా ఎవ్వరైనా కొనుగోలు చేసుకునేలా అవకాశం ఉండాలని కోరారు. తాజాగా ప్రభుత్వం పెట్రోల్, డీజీల్ ఆటోలను ఈవీ ఆటోలుగా మారిస్తే రూ.1.50 లక్షలు సబ్సిడీ ఇవ్వడం మంచి విషయమే. షోరూంలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించి ఈవీ ఆటోలను సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్క ఈవీ ఆటో రూ. 5 లక్షల వరకు ధర పలుకుతోందని ఆయన వాపోయారు.