పెన్పహాడ్ ఏప్రిల్ 20 : నేరాల నియంత్రణ లో సీసీ కెమెరాల కీలకమైన పాత్ర అని పెన్పహాడ్ ఎస్ఐ కాస్తాల గోపి కృష్ణ అన్నారు. ఆదివారం అనాజీ పురం, మాచారం గ్రామాల్లో దాతల సహకారంతో ఏర్పటు చేసిన కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కెమెరాలు నిరోధిస్తాయని, వాటి ప్రాముఖ్యతను ప్రతిఒక్కరూ గుర్తించాలన్నారు. జన సంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలను నియంత్రించవచ్చని, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతతో సీసీ కెమెరాలు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. వీటిని ప్రతిచోట ఏర్పాటు చేయడం ద్వారా నేర రహిత సమాజాన్ని నిర్మించడంలో కీలకంగా మారుతున్నాయన్నారు. గ్రామాల్లో సీపీ కెమెరాల ఏర్పాటుకు స్థానికులు ముందుకు రావాలని, కెమెరాల ఏర్పటు సహకరించిన దాతలను అభినందించారు. కార్యక్రమంలో బొల్లాక బొబ్బయ్య, మార్కెట్ కమిటీ డెరైక్టర్ దామోదర్ రెడ్డి, చెన్నూ రమణా రెడ్డి, ఇటుకల శ్రీనివాస్ పాల్గొన్నారు.