BRS Rajatotsava Sabha | తొగుట : ఈ నెల 27న వరంగల్లోని ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభకు ఉద్యమ స్ఫూర్తితో తరలిరావాలని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి పిలుపునిచ్చారు. తొగుటలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పిడికెడు మందితో కేసీఆర్ నాయకత్వాన పురుడు పోసుకున్న టీఆర్ఎస్ పార్టీ (బీఆర్ఎస్) నిఖార్సయిన, నిస్వార్థ కార్యకర్తల మూలంగా ఎంతో ఎత్తుకు ఎదిగిందని, నేడు 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం గర్వంగా ఉందన్నారు.
దుబ్బాక ఎమ్మెల్యే, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి నాయకత్వంలో బహిరంగ సభకు వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. 27న ఉదయం 11 గంటలకు అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి బహిరంగ సభకు బయలుదేరడం జరుగుతుందన్నారు. ప్రతీ గ్రామం నుంచి బయలుదేరే బస్సు సభా ప్రాంగణానికి రెండు గంటల ముందే చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని, కేసీఆర్ ప్రసంగం విన్న తర్వాత అక్కడి నుంచి తిరిగి వచ్చేలా గ్రామాల్లోని ముఖ్య కార్యకర్తలు చూసుకోవాలన్నారు.
కాంగ్రెస్ పాలనలో అన్నివర్గాలు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం అన్నింటా విఫలమైందని విమర్శించారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో చేసిన అభివృద్ధి, ఉద్యమ స్ఫూర్తి కనబడేలా ఉద్యమకారులు, కార్యకర్తలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. యూత్ మండల అధ్యక్షుడు మాదాసు అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ఎల్కతుర్తి బహిరంగ సభకు యువత పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఆయన వెంట సొసైటీ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి, సీనియర్ నాయకులు సుతారి రమేష్, అభిద్ హుస్సేన్, ఎంగలి నరేందర్ తదితరులు ఉన్నారు.
Palvancha : కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటున్న తెలంగాణ సమాజం : మాజీ మంత్రి వనమా
Amberpet | రజతోత్సవానికి రెడీ.. అంబర్పేటలో ముందే మురిసిన గులాబీ జెండా