MLA Kotha Prabhakarreddy | రాయపోల్, డిసెంబర్ 27: దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం గొల్లపల్లి, ఉదయాపూర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ భూపాల్, బీజేపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కనకయ్య, వార్డు సభ్యులు సత్తయ్య, కనకయ్య, రవి, నాయకులు కుమార్, మహేష్, కనకయ్య స్వామి, నర్సింలు స్వామి తదితరులు హైదరాబాద్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేక విధానాలతో బీజేపీ పార్టీ గ్రామ స్థాయిలో విశ్వసనీయత కోల్పోయిందని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని అమలు చేసిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, రైతులు, పేదలు, మహిళలు, యువతకు అండగా నిలిచిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు.
గ్రామాల అభివృద్ధికి నిధులు, సంక్షేమ పథకాలు నిలిచిపోయే పరిస్థితి ప్రస్తుతం నెలకొందని విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రజలు మరోసారి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, మళ్లీ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్లో చేరిన నాయకులందరూ గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తారని, అందరూ కలిసికట్టుగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు హన్మండ్ల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Hyderabad Real Estate | హైదరాబాద్ రియల్టీ డౌన్.. 23 శాతం పడిపోయిన ఇండ్ల అమ్మకాలు
పాలమూరు ప్రాణం మీదికొస్తే శంఖారావమే!
Gold Price | ఆల్టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు.. తులం ధర 1.42 లక్షలు