BRS Party | మనోహరాబాద్, ఏప్రిల్ 21 : బీఆర్ఎస్లోకి చేరికలు, వలసలు కొనసాగుతున్నాయి. ఇవాళ మనోహరాబాద్ మండలం కొండాపూర్, మనోహరాబాద్ గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.
తాజా మాజీ ఎంపీపీ పురం నవనీతరవి ముదిరాజ్, మాజీ ఎంపీటీసీ పొట్టోళ్ల లతావెంకట్గౌడ్ల ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరగా.. వీరికి ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్, గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు శేఖర్‌గౌడ్ గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, అడగకముందే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఈ సందర్భంగా పార్టీలో చేరిన నేతలు అన్నారు. ప్రజలంతా కేసీఆర్ పాలననే కోరకుంటున్నారన్నారు.
Prayag ManZhi | తనపై కోటి రూపాయల రివార్డ్ ఉన్న మావోయిస్టు మాంఝీ ఎన్కౌంటర్లో మృతి
Road Accident | నెలాఖరులో పదవీ విరమణ..అంతలోనే రోడ్డుప్రమాదం.. ఘటనలో హెడ్మాస్టర్ దుర్మరణం