తుంగతుర్తి, మార్చి 07 : తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులు అధ్యాపకులు, అధికారులు, ప్రజా ప్రతినిధులుగా అలరించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు చిత్తలూరి వెంకట్రామనరసమ్మ, పాఠశాల ఉపాధ్యాయ బృందం భీవనపల్లి శ్రీనివాస్, మల్లెపాక రవీందర్, గట్టు మాధవి, బండారు భవాని, జీడి అనిల్ కుమార్, మిట్టగడుపుల విక్రమ్, మాలోతు కృష్ణ, గుండ్ల ఆంజనేయులు, రామణబోయిన మౌనిక, పంజాల మంజుల, గోరోజు రమాదేవి పాల్గొన్నారు.