‘మహిళా హక్కుల రక్షణకై న్యాయ వ్యవస్థ నిరంతరం కృషి’
మహిళల హక్కులు, వారి రక్షణ కోసం న్యాయ వ్యవస్థ నిరంతరం కృషి చేస్తుందని నల్లగొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నల్లగొండలోని న్యాయ సేవా సదన్‌లో..
– నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు
రామగిరి, మార్చి 07 : మహిళల హక్కులు, వారి రక్షణ కోసం న్యాయ వ్యవస్థ నిరంతరం కృషి చేస్తుందని నల్లగొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నల్లగొండలోని న్యాయ సేవా సదన్‌లో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల హక్కులకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడినా బాధిత మహిళాలు న్యాయస్థానాల ద్వారా వారి హక్కులను కాపాడుకోవచ్చన్నారు. మహిళలు అన్ని రంగాల్లో తమ శక్తిని చాటుతూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. మహిళల అభ్యున్నతికి అందరూ సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
జిల్లా కోర్టు రెండవ అడిషనల్ న్యాయమూర్తి ఎన్.రోజారమణి మాట్లాడుతూ మహిళా చట్టాలను వివరించారు. దీనిలో భాగంగా మహిళా న్యాయమూర్తులు, మహిళా ఉద్యోగులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందచేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు దిలీప్ కులకర్ణి, డా.ప్రమీలాజైన్, కె.శీరిష, సౌందర్య, సాయి మేఘన, శరణి తేజ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి.పురుషోత్తమరావు, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ నిమ్మల భీమర్జున్రెడ్డి, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఎం.లెనిన్‌బాబు, కోర్టు నాజర్ రాంబాబు, డిఎల్ఎస్ఏ సూపరింటెండెంట్ ఏ.స్వర్ణలత, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

‘మహిళా హక్కుల రక్షణకై న్యాయ వ్యవస్థ నిరంతరం కృషి’
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి’
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

