వెల్దండ : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident ) హెడ్ మాస్టర్ ( Head Master ) దుర్మరణం చెందారు. తెలకపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్న పాపిశెట్టి శ్రీనివాసులు(Papishetty Srinivasulu ) హైదరాబాద్ నుంచి తెలకపల్లికి కారులో వస్తుండగా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ సమీపంలో పెట్రోల్ బంకు వద్ద హైదరాబాద్, శ్రీశైలం జాతీయ రహదారిపై( National Highway) ప్రమాదవశాత్తు కల్వర్టును ఢీ కొట్టాడు.
తీవ్ర గాయాలపాలైన ఆయనను కల్వకుర్తి ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. హైదరాబాద్లో బీటెక్ సెకండియర్ చదువుతున్న కూతురు, భార్య కమలతో కలిసి మన్నెగూడలో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ప్రతి శనివారం విధులు ముగించుకుని సోమవారం ఉదయం తిరిగి పాఠశాలకు హాజరు అయ్యేవాడని బంధువులు తెలిపారు.
కాగా హెడ్మాస్టర్ మృతి విషయం తెలుసుకున్న నాగర్ కర్నూల్ డీఈవో రమేష్ కుమార్, పలువురు ఉపాధ్యాయులు ఘటన స్థలానికి తరలివచ్చారు. శ్రీనివాసులు మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని నివాళి అర్పించారు.