CI Latheef | శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు : తొగుట సీఐ లతీఫ్
CI Latheef | గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో ప్రజలకు పూర్తి భరోసా కల్పించడానికే గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.
CI Latheef | తొగుట, డిసెంబర్ 06 : గ్రామపంచాయతీ ఎన్నికల్లో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని తొగుట సీఐ షేక్ లతీఫ్ అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని వెంకట్రావు పేట, లింగంపేట పెద్ద మా మాసాన్ పల్లి, కాన్గల్తోపాటు పలు గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ షేక్ లతీఫ్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో ప్రజలకు పూర్తి భరోసా కల్పించడానికే గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రజలు నిర్భయంగా పోలింగ్లో పాల్గొనాలని తెలిపారు.
ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలన్నారు. ఎలాంటి ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడరాదని ప్రజలను హెచ్చరించడమైనది. ఎవరైన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏదైనా ర్యాలీ లేదా బహిరంగ సభ నిర్వహించాలంటే తప్పనిసరిగా సంబంధిత మండల తహసీల్దార్, పోలీస్ వారి నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ముందస్తు అనుమతి లేకుండా ఎవరైనా ర్యాలీలు లేదా సమావేశాలు నిర్వహించినట్లయితే అట్టి వారిపై ఎన్నికల నిబంధనల ప్రకారం చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయన్నారు.
పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. ఎలాంటి ఫిర్యాదులు, అనుమానాలు ఉన్నా తక్షణమే నంబర్ 8712667343కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. అల్లర్లు సృష్టించాలని చూసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ రవి కాంతారావు, ఏఎస్ఐ రాంరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ మధుసూదన్ రెడ్డి, కానిస్టేబుల్ సంతోష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


Read Also :
Ilayaraja | ఇళయరాజా పాటల వివాదం.. రూ.50 లక్షలతో మైత్రీ మూవీస్ సెటిల్మెంట్.!
Sobhita Dhulipala | మొదటి వివాహ వార్షికోత్సవం.. స్పెషల్ వీడియో షేర్ చేసిన అక్కినేని కోడలు
Thudarum | మలయాళ బ్లాక్బస్టర్ ‘తుడరుమ్’ రీమేక్లో అజయ్ దేవగణ్ ?
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

