Harish Rao | నల్లబెల్లిలో దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పాల్గొని నివాళులు అర్పించారు. సంతాప సభలో హరీశ్ రావు మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకున్న జ్ఞాపకాలు గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. మొన్న పెద్ది సుదర్శన్ రెడ్డి ఆస్పత్రిలో పడితే నేను, కేటీఆర్ ఆగమేఘాల మీద పరుగెత్తుకుంటూ వచ్చాం. వచ్చే సరికి ఆస్పత్రి చూస్తే నాకొక పాత జ్ఞాపకం గుర్తొచ్చింది. ఒక ఉద్యమకారుడు తెలంగాణలో ఆత్మహత్య చేసుకుంటే డీసీఎంపై ఆ అమరుడి అంతిమయాత్ర జరుగుతుంది. ఆ అంతిమ యాత్ర జరుగుతుంటే వరంగల్‌లోని అమరవీరులస్థూపం వద్ద పోలీసులకు, మనకు మధ్య బాగా ఘర్షణ అయింది. ఆ ఘర్షణలో నేను డీసీఎంపై నుంచి కిందపడ్డానన్నారు.
డీసీఎంపై నుంచి కిందపడ్డప్పుడు నన్ను పట్టుకున్నది పెద్ది సుదర్శన్ రెడ్డి. నేను భూమి మీద పడాలి. కానీ నేను ఆయన చేతుల పడి కిందపడ్డా ఆరోజు. వెంటనే సుదర్శన్ రెడ్డి నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లిండు. ఆ రోజు ఏ ఆస్పత్రికైతే సుదర్శన్ రెడ్డి నన్ను తీసుకపోయిండో.. పాపం ఆ ఆస్పత్రిలో సుదర్శన్‌రెడ్డిని చివరి చూపు కూడా చూస్తానని కలలు కూడా కనలేదు. అప్పుడు నాకు దెబ్బతాకితే ఆగమేఘాల మీద సుదర్శన్ రెడ్డి నన్ను ఆ ఆస్పత్రికి తీసుకపోయిండు. పాపం సుదర్శన్ రెడ్డి చివరి దశలో ఆ ఆస్పత్రిలో ఉన్నడని కన్నీంటి పర్యంతమయ్యారు.
ఉద్యమ సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకున్న జ్ఞాపకాలు గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకున్న హరీష్ రావు https://t.co/iXz7xHIOjO pic.twitter.com/fXtdXO82L2
— Telugu Scribe (@TeluguScribe) August 10, 2026
Harish Rao | సాగునీటి కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిన హరీశ్ రావు
Lok Sabha: లోక్‌సభలో 4 బిల్లులు.. సభ 2 గంటల వరకు వాయిదా
TN Assembly | తమిళనాడులో రాష్ట్ర గీతానికి పెద్దపీట.. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం