Amberpeta Shankar | అంబర్‌పేట శంకర్‌పై పోలీసులు మళ్లీ రౌడీషీట్ ఓపెన్ చేశారు. జూబ్లీహిల్స్, మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధుల్లో అంబర్‌పేట శంకర్ బెదిరింపులకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మరోసారి అతడిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. 2019లో శంకర్‌పై రౌడీషీట్ మూసివేశారు. తాజాగా రెండు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవడంతో రౌడీషీట్ ఓపెన్ చేసినట్టు తెలుస్తోంది.
జూన్ నెలలో గాజులరామారం ప్రాంతంలో బిల్డర్‌కు తెలియకుండా ప్లాట్లు అమ్మడంతో అంబర్ పేట శంకర్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అంతేకాదు గతంలో ఓ న్యూస్ ఛానల్ నిర్వాహకులు, ఓ వ్యక్తి మధ్యవర్తిగా ఉండటంతో శంకర్‌పై కేసు నమోదైనట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి.
Walking vs Yoga | నడక మంచిదా.. యోగా మంచిదా? మీ ఆరోగ్యానికి ఏది సరైనదో తెలుసుకోండి