Sarfaraz Khan: 18 నెలల్లో 17 కేజీల బరువు తగ్గిన సర్ఫరాజ్ ఖాన్
Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్ సూపర్ స్లిమ్ అయ్యాడు. బాడీ వెయిట్ తగ్గాడు. 18 నెలల్లో అతను 17 కేజీల బరువు తగ్గేశాడు. ముంబై క్రికెటర్ ఇటీవల తన ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే లంకతో జరిగే టెస్టు సిరీస్‌కు అతన్ని ఎంపిక చేశారు.
ముంబై: క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) మళ్లీ టీమిండియా జట్టులో చోటు సంపాదించాడు. శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు అతన్ని ఎంపిక చేశారు. సాయి సుదర్శన్ గాయపడడంతో.. అతని స్థానంలో సర్ఫరాజ్‌కు చోటు కల్పించారు. అయితే గతంలో భారీ బరువు వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ ఖాన్.. ఇప్పుడు సూపర్ స్లిమ్ అయ్యాడు. గడిచిన 18 నెలల్లోనే అతను సుమారు 17 కేజీల బరువు తగ్గాడని తెలిసింది. దీంతో చాలా అట్రాక్టివ్‌గా, హుషారుగా సర్ఫరాజ్ కనిపిస్తున్నాడు. ఇటీవల ముంబై టీ20 లీగ్‌లో అతను తన మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. ఆకాశ్ టైగర్స్ వెస్ట్రన్ ముంబై తరపున అతను ఆ టోర్నీలో ఆడాడు. అయితే ఆ టోర్నీ ముగిసిన తర్వాత వర్షాకాలం కావడంతో.. అతను తన ప్రాక్టీస్‌ను కశ్మీర్‌కు మార్చేశాడు. అక్కడ నెట్ బౌలర్లతో ప్రాక్టీస్ చేశాడు. ఈ సమయంలోనే అతను ఫిట్‌నెస్‌పై మరింత ఫోకస్ పెట్టాడు. నేను ఫిట్ లేకపోవచ్చు, కానీ అన్ని రకాలుగా పోరాడుతాను అని కొన్ని రోజుల క్రితమే సర్ఫరాజ్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నాడు.
రంజీల్లో సర్ఫరాజ్ ఖాతాలో ట్రిపుల్ సెంచరీ ఉన్నది. కానీ జాతీయ జట్టు ఎంపిక విషయంలో అతను కొన్ని అవరోధాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. భారీ కాయం వల్ల సర్ఫరాజ్ ఖాన్‌ను పక్కనపెడుతున్నారేమో అన్న అనుమానాలు ఓ దశలో వ్యక్తం అయ్యాయి. అయితే సర్ఫరాజ్ ఇప్పుడు తన లుక్‌ను మార్చేశాడు. షార్ప్‌గా మారిపోయాడు. ముంబై టీ20 క్రికెట్ లీగ్‌తో అతను మరింత రాటుదేలాడు. కశ్మీర్‌లోని షేర్-ఇ-కశ్మీర్ స్టేడియంలో తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాడు. తన స్కిల్స్‌ను అతను పెంచుకుంటున్నాడు.
2024లో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో నాలుగు సార్లు సర్ఫరాజ్ విఫలం అయ్యాడు. దీంతో అతన్ని టీమిండియా జట్టు నుంచి తప్పించారు. వాస్తవానికి ఆ సిరీస్‌లో మేటి బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. కానీ వేటు మాత్రం సర్ఫరాజ్‌పై పడింది. తిరిగి జట్టులో స్థానం సంపాదించేందకు సర్ఫరాజ్ తీవ్రంగా ప్రయత్నించాడు. వాస్తవానికి లంక టూరు కోసం రుతురాజ్ గైక్వాడ్, షేక్ రషీద్ పేర్లు చర్చకు వచ్చాయి. కానీ గిల్, పంత్ తర్వాత స్పిన్‌ను మెరుగ్గా ఆడే బ్యాటర్ల జాబితాలో సర్ఫరాజ్ నిలుస్తాడని అంచనా వేశారు.
ద్రువ్ జురెల్ కన్నా మెరుగ్గా సర్ఫరాజ్ ఆడుతాడేమో అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. స్పిన్‌ను ఆడడంలో జురెల్ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. సంపూర్ణంగా ఫిట్ అయిన సర్పరాజ్ ఖాన్.. ఇక ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యే లంక సిరీస్‌లో రాణిస్తాడన్న ఆశాభావం వ్యక్తం అవుతోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

