Harish Rao | మునిపల్లి, సెప్టెంబర్ 23 : స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేసేందుకు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సూచించారు. మంగళవారం మునిపల్లి మండలంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సమక్షంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్బంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండి.. పల్లెలో గులాబీలా జెండాలు ఎగిరే విధంగా కృషి చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొంగ హామీలను గడపగడపకు వివరించాలని హరీష్ రావు సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను గ్రామాల్లో గడపగడపకూ వివరించాలన్నారు.
పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు..
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు రాష్టంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారో ప్రజలకు గడపగడపకూ తిరిగి ప్రజలకు అర్థం అయ్యేలా వివరించాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు తప్పనిసరి.. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు వస్తుందని అన్నారు. కష్టకాలంలో పార్టీని బలోపేతం చేసేవారికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసేవారికి తగిన గుర్తింపు వస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, రాష్ట్ర నాయకులు జైపాల్ రెడ్డి, మునిపల్లి మాజీ ఎంపీపీ శైలజ, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మంతురి శశికుమార్, యువత అధ్యక్షుడు ఆనంద్, నాయకులు పెద్దలోడి వెంకటేశం, పెద్దలోడి మొగులయ్య, శంకరయ్య, విట్టల్, పాండు, నాగేష్, దత్తు, ఈశ్వరప్ప, సుధాకర్, పవన్ రెడ్డి, రవి తదితరులు ఉన్నారు.
Hyderabad Metro | మరోసారి ఆగిపోయిన మెట్రో రైలు.. ఆందోళనకు గురైన ప్రయాణికులు
Fire Accident | మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధిలో తప్పిన పెను ప్రమాదం
Harish Reddy | నెలరోజులైనా తెరచుకోని రామగుండం ఎరువుల కర్మాగారం: బీఆర్ఎస్ నేత హరీశ్ రెడ్డి