Fire Accident | రంగారెడ్డి : మైలార్‌దేవ్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం తప్పింది. ఓల్డ్ టైర్స్ స్క్రాప్ లోడ్‌తో నిండి ఉన్న డీసీఎంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు స్క్రాప్ యజమాని పేర్కొన్నారు. స్థానికుల అప్రమత్తతతోనే పెను ప్రమాదం తప్పిందన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మంటలు ఎగిసిపడ్డ సమయంలో పొగలు దట్టంగా కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.