CPS Employees | జహీరాబాద్, ఫిబ్రవరి 23 : సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని సంగారెడ్డి జిల్లా తపస్ అధ్యక్షుడు దత్తాత్రి డిమాండ్ చేశారు. సోమవారం జహీరాబాద్ పట్టణంలోని స్థానిక UPS No 3 జహీరాబాద్ పాఠశాలలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తపస్ జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే పెండింగ్ బిల్లులు అన్ని ఒకే సారి విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం నెలల వారీగా విడుదల చేస్తూ కాలయాపన చేయడం సరికాదన్నారు.
సీపీఎస్ ఉద్యోగుల ఏరియర్స్ బిల్స్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు విడుదల చేయకపోవడం అన్యాయమన్నారు. ఫిబ్రవరి నెల విడుదల చేసే రూ. 700 కోట్ల రూపాయలలో సీపీఎస్ ఉద్యోగుల పెండింగ్ బిల్స్ విడుదల చేయాలని కోరారు. ఏరియా బిల్స్ వాయిదాల పద్ధతిలో కాకుండా ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం సమగ్ర శిక్షా, కేజీబీవీ ఉద్యోగులు చేసిన సమ్మె కాలపు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో సంగారెడ్డి జిల్లా కోశాధికారి తుక్కప్ప, జిల్లా కార్యదర్శి తుకారాం, జహీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు శ్రీపాల్ పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
The Paradise | ‘ది ప్యారడైజ్’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ ప్రోమో రిలీజ్.. నాని ఎనర్జీ చూసి షాక్!
Nani | మాస్ మోడ్లో నాని.. ‘బ్లడీ రోమియో’లో నేచురల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ?
MSG | ‘మన శంకర వరప్రసాద్ గారు’ సూపర్ సక్సెస్ – రీజినల్ ఇండస్ట్రీ హిట్గా సంచలనం!