ఖమ్మం రూరల్, జూలై 29 : జమ్మూ & కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బుధవారం ఖమ్మం పర్యటనలో భాగంగా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడెం గ్రామంలో గల నామ ముత్తయ్య–వరమ్మ స్మృతి వనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ లోక్సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తల్లిదండ్రులు నామ ముత్తయ్య, వరమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని సందర్శించి, నామ ముత్తయ్య–వరమ్మ జీవిత విశేషాలు, సమాజానికి అందించిన సేవల గురించి తెలుసుకున్నారు. అక్కడ ప్రదర్శించిన అరుదైన చిత్రాలను పరిశీలించారు. గ్యాలరీ ఫొటోల విశేషాలను నామ సోదరుడు సీతయ్య వివరించారు.