Mandaadi | రూ. 100 కోట్ల వసూళ్లు.. ‘మండాడి’ టీమ్‌పై కమల్ హాసన్ ప్రశంసలు!
Actor Soori and Mandaadi | ప్రముఖ నటుడు సూరి హీరోగా నటించిన తాజా చిత్రం 'మండాడి' ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల వసూళ్లను రాబట్టి ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, లెజెండరీ నటుడు కమల్ హాసన్ ఈ చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
Actor Soori and Mandaadi | ప్రముఖ నటుడు సూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మండాడి’ ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల వసూళ్లను రాబట్టి ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, లెజెండరీ నటుడు కమల్ హాసన్ ఈ చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. మత్స్యకారుల జీవితాలు మరియు సంప్రదాయ పడవ రేసుల (పాయ్ మార పడగు) నేపథ్యంలో మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సూరితో పాటు సుహాస్ కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఈ చిత్రం రూ. 109.25 కోట్ల ప్రపంచవ్యాప్త వసూళ్లను సాధించింది. అయితే తాజాగా ఈ సినిమాను చూసిన కమల్ హాసన్ చిత్రబృందానికి కలుసుకుని సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు.
ఇక కమల్ హాసన్‌ను కలవడం తన జీవితంలో మరువలేని క్షణమని హీరో సూరి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. “డాక్టర్ కమల్ హాసన్ సర్, మీ నిస్వార్థమైన ప్రేమ, శక్తివంతమైన మాటలు, దీవెనలు మా మండాడి ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాయి” అంటూ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు మతిమారన్ పుగళేంది కూడా స్పందిస్తూ, సినిమా రంగంలో సీనియర్ విద్యార్థి, నిరంతరం స్పూర్తినిచ్చే కమల్ హాసన్‌ను కలవడం సంతోషంగా ఉందని, తమ చిత్రాన్ని అభినందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రంలో ప్రతినాయక పాత్రలో నటించిన టాలీవుడ్ నటుడు సుహాస్ మాట్లాడుతూ, కొన్ని క్షణాలు మనల్ని నిశ్చేష్టులను చేస్తాయి. నట దిగ్గజం కమల్ హాసన్ సర్ పక్కన నిలబడటం నా కల సాకారమైన క్షణం అంటూ తన ఆనందాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
#KamalHaasan sir wishes the entire team of #Mandaadi for the film’s successful run! ❤️🔥
Such a beautiful gesture from a legend! 🙏 @ikamalhaasan@sooriofficial #MandaadiTeam pic.twitter.com/2Tx8SiaMZd
— Sallu_TweetZ🐉 (@msdsalmaan007) September 23, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

