Army Jobs | ఇండియన్ మిలిటరీ ఆర్మీ (IMA) టెక్నికల్ గ్రాడ్యుయేట్ 145వ కోర్సు (TGC) కోసం షార్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా 30 ఖాళీలను భర్తీ చేయనుంది. అవివాహిత పురుష ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు భారత సైన్యంలో శాశ్వత కమిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆర్మీ కోరుతుంది. దరఖాస్తు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 29లోగా చేసుకోవాలి.
వివరాలు
145వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సును డెహ్రాడూన్ (Dehradun)లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో నిర్వహిస్తారు.
ఈ కోర్సు 2027, జూలై నుంచి ప్రారంభం కానుంది.
శిక్షణ తరువాత లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగం ప్రారంభం.
విభాగాలవారీగా ఖాళీలు
సివిల్- 8
ఎలక్ట్రికల్- 2
కంప్యూటర్ సైన్స్- 6
మెకానికల్- 6
ఎలక్ట్రానిక్స్- 6
మిసెల్లెనియస్ ఇంజినీరింగ్ స్ట్రీమ్స్- 2

Tgc 145th
అర్హతలు
అభ్యర్థులు సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్ లేదా ఎమ్మెస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. బీఈ, బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అర్హులు.
అభ్యర్థుల వయసు 2027, జూలై 1 నాటికి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. వివాహం కాని పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక
విద్యార్హత మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. తరువాత SSB ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. తరువాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలో పొందిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు.
దరఖాస్తు
దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభమవుతుంది. అక్టోబర్ 29తో ముగుస్తుంది. ఇతర వివరాలకు వెబ్సైట్ www.joinindianarmy.nic.inలో చూడండి.