Bus Driver | బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.5.5 కోట్ల నోట్ల కట్టలు.. 15 కిలోల బంగారం..!
Bus Driver | పశ్చిమబెంగాల్ (West Bengal) లో బస్సు డ్రైవర్ ఇంట్లో (Bus Driver) పెద్దఎత్తున నోట్ల కట్టలు (Currency notes), బంగారం బిస్కెట్లు (Golden Biscuits) బయటపడ్డాయి. ఇసుక, క్వారీ మాఫియా (Sand, Quarry) పై దర్యాప్తులో భాగంగా చేపట్టిన సోదాల్లో ఈ సొమ్మును పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు రూ.5.5 కోట్ల నగదు, 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Bus Driver : పశ్చిమబెంగాల్ (West Bengal) లో బస్సు డ్రైవర్ ఇంట్లో (Bus Driver) పెద్దఎత్తున నోట్ల కట్టలు (Currency notes), బంగారం బిస్కెట్లు (Golden Biscuits) బయటపడ్డాయి. ఇసుక, క్వారీ మాఫియా (Sand, Quarry) పై దర్యాప్తులో భాగంగా చేపట్టిన సోదాల్లో ఈ సొమ్మును పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు రూ.5.5 కోట్ల నగదు, 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బీర్భూమ్ జిల్లాకు చెందిన మీనా మండల్ నివాసంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
ఇసుక మాఫియాపై దర్యాప్తులో భాగంగా పక్కా సమాచారంతో ఈ సోదాలు జరిపారు. ఈ క్రమంలోనే అతడి ఇంట్లో భారీగా అక్రమ నగదు బయటపడింది. స్థానికంగా ఇసుక, క్వారీ మాఫియా డాన్‌గా పేర్కొనే తులు మండల్‌కు.. మీనా మండల్ సమీప బంధువు. గతంలో బెంగాల్ ప్రభుత్వంలో బస్సు డ్రైవర్‌గా పనిచేసిన మీనా.. ఆ తర్వాత ఉద్యోగం మానేసి క్వారీ వ్యాపారం మొదలుపెట్టాడని పోలీసులు తెలిపారు.
డబ్బు, బంగారంతోపాటు మీనా పేరు మీద పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ఈ సంపద ఎలా వచ్చిందనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌పై బెంగాల్ సీఎం సువేందు అధికారి ఎక్స్ వేదికగా స్పందించారు. పక్కా సమాచారంతో చేపట్టిన ఈ ఆపరేషన్ విజయవంతమైందని తెలిపారు. పోలీసులను అభినందించారు. ప్రజల సొమ్మును కొల్లగొట్టేవారిని ఎన్నటికీ వదిలిపెట్టబోమని, అవినీతికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
కాగా బీర్భూమ్లో దాదాపు 250 క్వారీలు అక్రమంగా నడుస్తున్నాయని, అవన్నీ తులు మండల్ కనుసన్నల్లోనే పనిచేస్తున్నాయని పోలీసులు గుర్తించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

