Sandeep Patil | అభిషేక్, వైభవ్‌పై సందీప్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో ఇంకా మెరుగుపడాలి!
Sandeep Patil | భారత క్రికెట్లో దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీలపై మాజీ భారత ఆల్‌రౌండర్ సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరిలోనూ అద్భుతమైన ప్రతిభ, భారీ షాట్లు ఆడే సామర్థ్యం ఉన్నాయని ప్రశంసించిన ఆయన.. విదేశీ పరిస్థితుల్లో మాత్రం తమ ఆటను మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
Sandeep Patil | భారత క్రికెట్లో దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీలపై మాజీ భారత ఆల్‌రౌండర్ సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరిలోనూ అద్భుతమైన ప్రతిభ, భారీ షాట్లు ఆడే సామర్థ్యం ఉన్నాయని ప్రశంసించిన ఆయన.. విదేశీ పరిస్థితుల్లో మాత్రం తమ ఆటను మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. అభిషేక్, వైభవ్ స్వదేశంలో బంతిని ఎదుర్కొనే సమయంలో ఎంతో దూకుడుగా కనిపిస్తున్నారని పాటిల్ పేర్కొన్నారు. అయితే బంతి స్వింగ్ అవుతున్నప్పుడు ఇద్దరూ కొంత ఇబ్బంది పడుతున్నట్లు కనిపించిందని చెప్పారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ పర్యటనలో ఈ విషయం స్పష్టంగా కనిపించిందని ఆయన అభిప్రాయపడ్డారు. విదేశీ పిచ్‌లపై పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ శైలిని మార్చుకోవడం యువ ఆటగాళ్లకు చాలా ముఖ్యమని సూచించారు.
జులైలో జరిగిన ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లో అభిషేక్ శర్మ ఐదు మ్యాచ్‌లు ఆడి 131 పరుగులు చేశాడు. అదే సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేశాడు. మూడు మ్యాచ్‌ల్లో 42 పరుగులు చేశాడు. స్వింగ్‌కు అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో ఇద్దరి బ్యాటింగ్‌పై ప్రశ్నలు తలెత్తినప్పటికీ.. ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో వారు తమ సత్తాను చాటుకున్నారు.జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ ఆకట్టుకున్నాడు. భారత్ 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకున్న సమయంలో అతడు సిరీస్‌లో అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. చివరి మ్యాచ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసి మ్యాచ్‌లో అత్యుత్తమ ఆటగాడి పురస్కారాన్ని అందుకున్నాడు.మరోవైపు అఫ్గానిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అభిషేక్ శర్మ తన బ్యాటింగ్ పవర్‌ను మరోసారి చూపించాడు. భారత్ 3-0తో సిరీస్‌ను గెలుచుకున్న ఈ పోరులో చివరి మ్యాచ్‌లో కేవలం 30 బంతుల్లోనే శతకం సాధించి సంచలనం సృష్టించాడు.
అభిషేక్ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ రావడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని పాటిల్ పేర్కొన్నారు. ఆధునిక క్రికెట్లో యువ బ్యాటర్లకు తొలి బంతి నుంచే సహజమైన దూకుడుతో ఆడే స్వేచ్ఛ లభిస్తోందని పాటిల్ అన్నారు. అభిషేక్, వైభవ్ ఆ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నారని ప్రశంసించారు. ఇద్దరిలోనూ శక్తి, నైపుణ్యం, భారీ షాట్లు ఆడే సామర్థ్యం పుష్కలంగా ఉన్నాయని చెప్పారు.అయితే విదేశీ పర్యటనల్లో పరిస్థితులు మారినప్పుడు కూడా అదే స్థాయిలో ప్రభావం చూపాలంటే తమ ఆటలో కొన్ని అంశాలను మెరుగుపర్చుకోవాల్సి ఉంటుందని పాటిల్ సూచించారు. ముఖ్యంగా స్వింగ్ అవుతున్న బంతులను సమర్థంగా ఎదుర్కొనే విషయంలో మరింత పట్టు సాధిస్తే.. ఈ ఇద్దరు యువ బ్యాటర్ల ఆట మరింత పరిపూర్ణంగా మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

