Shah Rukh Khan | బాలీవుడ్ యాక్టర్లు సన్నీడియోల్, ప్రీతి జింటా లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన సినిమా ‘బట్వారా 1947′. ఆగస్టు 14న విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ సందర్భంగా ’గబ్బర్ సింగ్’ విలన్ అభిమన్యు సింగ్ మాట్లాడుతూ.. సన్నీ డియోల్‌ను కొట్టిన తర్వాతే షారుఖ్ ఖాన్ స్టార్‌గా ఎదిగారంటూ కామెంట్ చేయడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ఈ విషయం గురించి అభిమన్యు సింగ్ మాట్లాడుతూ.. సన్నీడియోల్ ఒక మెగాస్టార్. ‘డర్’ (Darr) సినిమా షూటింగ్ సమయంలో సన్నీడియోల్ షారుక్‌ఖాన్‌ను కొట్టారు. ఈ విషయం ప్రతీ యాక్టర్‌కు తెలుసు. కానీ షారుక్‌ఖాన్ అభిమానులు, కొందరు పాకిస్థానీ జిహాదీ ముస్లింలు దీన్ని నమ్మరు. ఏదేమైనా సన్నీడియోల్ షారుక్ ఖాన్‌ను కొట్టడం వల్లే డర్ సినిమాకు మంచి పబ్లిసిటీ అయి బ్లాక్ బస్టర్ అయిందనేది నిజమని అన్నాడు. ఆ దెబ్బ కారణంగా షారుక్ ఖాన్‌కు సానుభూతి లభించింది. ఆ తర్వాత షారుక్ ఖాన్ స్టార్‌గా ఎదిగారని చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తెలుగులో పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో విలన్‌గా సూపర్ యాక్టింగ్‌తో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు అభిమన్యు సింగ్. రక్త చరిత్ర ప్రాంచైజీ, బెజవాడ, దేవర ప్రాంచైజీ, ఓజీలో కూడా నటించాడు.
Mega Exclusive 🚨
Abhimanyu Singh stated during the trailer launch of Batwara 1947 that #ShahRukhKhan Sunny Deol se maar kha ke Star Ban gaya#SunnyDeol is a megastar and he beat SRK on the sets of the film Darr. This story is known to every actor, but #SRK fans and some… pic.twitter.com/xu4s3CWEqz
— Rahul Gupta (@RahulGupta25376) July 29, 2026
US Tariff Bill | అమెరికా రష్యాపై ఆంక్షల బిల్లు.. భారత్, చైనాలపై సుంకాల చిల్లు