TJMU | సంగారెడ్డి, జూన్ 3 : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ప్రభుత్వం వేతన సవరణపై తీపి కబురు చెబుతుందని ఆశించిన కార్మికులకు మొండిచెయ్యి చూపిందని టీజేఎంయూ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి ప్రభుత్వంపై మండిపడ్డారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు చెబుతామని రవాణాశాఖ మంత్రితోపాటు టీపీసీసీ చీఫ్ ఆశలు పెట్టారని, కానీ సీఎం రేవంత్రెడ్డి ఆర్టీసీపై సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం రాగానే మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించిన ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు, వేతన సవరణ, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం వంటి సమస్యలపై ఎందుకు దృష్టి సారించడంలేదని ప్రశ్నించారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు తీపి కబురు వస్తుందని ఆశించిన కార్మికులందరికీ నిరాశే మిగిలిందన్నారు. రేపు జరగబోయే మంతివర్గ సమావేశంలో కార్మికుల వేతన సవరణ, ప్రభుత్వంలో విలినం, యూనియన్ల పునరుద్దరణపై ప్రకటన చేసి సమన్యాయం పాటించాలని ప్రభుత్వాన్ని కృష్ణమూర్తి కోరారు.
Crocodile | గద్వాలలో అర్ధరాత్రి కలకలం.. ఇండ్ల మధ్యకు వచ్చిన మొసలి
Electric Vehicles | రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు.. రెండు లక్షలు దాటిన ఈవీలు
Mongolia | విశ్వాసం కోల్పోయి.. మంగోలియా ప్రధాని రాజీనామా