హైదరాబాద్: తెలంగాణలో పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాల(Electric Vehicles) సంఖ్య 2 లక్షల మైలురాయిని దాటింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే (మార్చి 31) నాటికి రవాణాశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1.96 లక్షలకుపైగా ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. ఏప్రిల్ నెలాఖరునాటికి ఆ సంఖ్య 2 లక్షలు దాటినట్లుగా రవాణాశాఖ వర్గాలు తెలిపాయి. మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల్లో అత్యధికంగా (80 శాతంపైగా) బైక్లు ఉండగా తర్వాత స్థానంలో కార్లు ఉన్నాయి. ఈవీలతో అటు వాటి యజమానులతోపాటు ఇటు పర్యావరణానికీ మేలు జరుగుతోంది.