సారంగాపూర్, మార్చి 11 : ప్రభుత్వ భూములు, గుట్టలపై అక్రమార్కులు కన్నేశారు. అక్రమంగా మొరం మట్టి తరలించి జేబులు నింపుకొంటున్నారు. రెవెన్యూ, మైనింగ్ యంత్రాంగం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని జామ్ కరిశలగుట్ట, సారంగాపూర్‌లోని అంబవాయి చెరువు, దేవుల్లగుట్ట, బీరవెల్లి గుట్ట, స్వర్ణలో అటవీ, ప్రభుత్వ భూముల నుంచి శని, ఆదివారాలు అక్రమార్కులు మొ రం మట్టిని తరలిస్తున్నారు. మై నింగ్శాఖ అనుమతి తప్పనిసర న్న నిబంధన ఉన్నా.. దానిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు తవ్వకాలు జరుపుతున్నారు. గ్రామంలో మొరం మట్టి ఒ క్కొక్క ట్రాక్టర్‌కు రూ.350 నుంచి రూ.400, దూరప్రాంతాలకు అయితే రూ.1000 నుంచి రూ.2వేలు, టిప్పర్ మట్టికి రూ.10 వేలకు విక్రయిస్తున్నారు. నిత్యం లక్షల విలువ చేసే మట్టిని తరలిస్తుండడం గమనార్హం. అధికారుల కళ్లేదుట మట్టి దందా జరుగుతున్న అడ్డుకొనే వారే లేరు.
గుట్టలు, చెరువులు ఖాళీ
సారంగాపూర్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. పునాదులు నింపేందుకు మట్టి అవసరం. రోజు ఇళ్ల నిర్మాణాలకు వందకుపైగా ట్రాక్టర్లు తరలిపోతున్నాయి. గ్రామాల్లో గుట్టలు కరిగిపోతున్నాయి. ప్రభుత్వ భూములు, చెరువుల్లో పెద్ద గుంతలు ఏర్పుతున్నాయి. దీంతో ప్రమాదకరంగా మారడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మొరంమట్టి రవాణాకు కొందరు అక్రమార్కులు జేసీబీలు, ట్రాక్టర్లును కొనుగోలు చేయడం గమనార్హం. మొరం మట్టి పెద్ద మొత్తంలో అక్రమ రవాణ జరుగుతున్న అధికారులు మూమూళ్ల మత్తులో మునిగి తేలుతున్నరన్న ఆరోపణలు గుప్పుమంటున్నారు. అధికారులు పట్టించుకొని మొరం మట్టి దందాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
మైనింగ్ శాఖ అనుమతి ఇవ్వాలి..
మొరం తవ్వకాలకు మైనింగ్‌శాఖ అధికారులు పర్మిషన్ ఇవ్వాలి. మొరం అవసరం ఉన్న వారు దరఖాస్తు పెట్టుకుంటే మైనింగ్ శాఖ అధికారులకు పంపుతాం. అక్కడి నుంచి పర్మిషన్ వస్తే మొరం తవ్వుకోవడానికి వీలు ఉంటుంది. సారంగాపూర్ మండలంలోని మొరం తరలించడానికి ఎలాంటి అనుమతులు లేవు. మొరం మట్టి అక్రమ దందాను అరికట్టడానికి చెక్‌పోస్టులు పెట్టాం. – సంధ్యారాణి, తహసీల్దార్, సారంగాపూర్.