Teacher | జహీరాబాద్, అక్టోబర్ 8 : విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయురాలు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. స్థానిక పట్టణంలోని నెంబర్ 4 ఎంపీయుపిఎస్ పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న సుజాత ఉదయం విధి నిర్వహణలో భాగంగా విద్యార్థులకు చదువు చెప్పేందుకు తరగతి గదిలోకి వెళ్లింది. అంతలోనే ఆమె ఛాతిలో తీవ్రమైన నొప్పి (గుండెపోటు) రావడంతో తరగతి గదిలోనే కుప్పకూలిపోయింది.
విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే తరగతి గదిలోకి చేరుకుని వైద్యం కోసం తరలించేందుకు ఆమెను పరిశీలించగా అప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలు సొంత గ్రామం కోహిర్ మండలం పగిడిగుమ్మల్. ఉపాధ్యాయురాలు మృతి పట్ల విద్యాధికారి మానయ్య, పలు ఉపాధ్యాయుల సంఘాల నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు విచారం వ్యక్తం చేశారు.
బుధవారం సాయంత్రం స్వగ్రామమైన పగిడి గుమ్మల్ గ్రామంలో జరిగిన అంత్యక్రియలకు విద్యాధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Actor Srikanth Bharat | మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ నటుడు
The Paradise | దసరా డైరెక్టర్‌తో ‘కిల్’ రాఘవ.. నాని ది ప్యారడైజ్‌పై సూపర్ హైప్