Shrikanth BHARAT | జాతిపిత మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ భరత్. గాంధీ మహాత్ముడా? జాతిపితనా? అంటూ రాయడానికి వీలులేని పదాలతో దూషించాడు. అయితే శ్రీకాంత్ విడుదల చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్ల నుంచి, గాంధీ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.
అక్టోబర్ 02న గాంధీ జయంతి సందర్భంగా గాంధీని దూషిస్తూ.. ఒక వీడియోను విడుదల చేశాడు. అయితే ఈ వీడియోపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దీంతో ఈ వీడియోపై స్పందిస్తూ మరో వీడియోను వదిలాడు. ఇందులో గాంధీజీ మహాత్ముడు కాడని.. స్త్రీలోలుడని, ఏంతో మంది అమ్మాయిలను గాంధీ లైంగికంగా వేధించాడని ఆరోపించాడు. అయితే శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులు తక్షణమే అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Dare to WATCH?!?!?!
THE TRUTH!!!!!!! pic.twitter.com/0Y0kO2cvDP
— Shrikanth BHARAT (@Shri__Bharat) October 6, 2025