Pradeep Ranganathan | యాక్టర్ కమ్ డైరెక్టర్‌గా దూకుడు మీదున్న కోలీవుడ్ యంగ్ సెలబ్రిటీల్లో టాప్‌లో ఉంటాడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). లవ్ టుడే మూవీ అందించిన సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే.
ప్రదీప్ రంగనాథన్ నటిస్తోన్న కొత్త ప్రాజెక్టులు డ్యూడ్ (Dude), లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK). డ్యూడ్ అక్టోబర్ 17న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది ప్రదీప్ రంగనాథన్ టీం. ఈ రెండు సినిమాలు విడుదల కాకముందే కొత్త ప్రాజెక్టు గురించి చెప్పి మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచుతున్నాడు ప్రదీప్ రంగనాథన్.
తన కొత్త సినిమా సైన్స్ ఫిక్షన్ జోనర్లో ఉండబోతుందని.. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ విడుదలయ్యాక ఈ మూవీపై ఫోకస్ పెడతానని చెప్పాడు. అంతేకాదు స్వీయదర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో తానే హీరోగా నటిస్తానని చెప్పాడు. కథను అంచనా వేయని విధంగా ఉంటుంది. సినీ జనాలు నాలో ఉన్న మరో యాంగిల్‌ను చూస్తానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ కామెంట్స్‌తో నెట్టింట హాట్ టాపిక్‌గా మారాడు ప్రదీప్ రంగనాథన్.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న డ్యూడ్ సినిమాలో మమితా బైజు హీరోయిన్గా నటిస్తోంది. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రాన్ని విఘ్నేశ్ శివన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఉప్పెన ఫేం కృతి శెట్టి ప్రదీప్ రంగనాథన్‌తో రొమాన్స్ చేయనుంది.
The Paradise | దసరా డైరెక్టర్‌తో ‘కిల్’ రాఘవ.. నాని ది ప్యారడైజ్‌పై సూపర్ హైప్