Rajini Kamal Movie | కోలీవుడ్ స్టార్ యాక్టర్ రజినీకాంత్, కమల్ హాసన్ కాంబోలో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. మూడు దశాబ్ధాల తర్వాత ఈ ఇద్దరు మల్టీ స్టారర్ ప్రాజెక్ట్‌తో సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ బిగ్ టికెట్ ఎంటర్టైనర్ను స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేయబోతున్నాడంటూ ముందుగా వార్తలు తెరపైకి వచ్చాయి. కాగా తాజాగా మేకర్స్ డైరెక్టర్లుగా పలువురి పేర్లను పరిశీలిస్తున్నారట. దీనికి సంబంధించి క్రేజీ గాసిప్ నెట్టింట రౌండప్ చేస్తోంది.
యంగ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడంటూ ఆసక్తిక వార్త తెరపైకి వచ్చింది. అయితే ఇటీవలే డ్యూడ్ సినిమా ప్రమోషన్స్‌లో ఈ విషయమై క్లారిటీ ఇచ్చాడు ప్రదీప్ రంగనాథన్. నేను ఆ సినిమా చేయడం లేదు. నేను డైరెక్షన్‌పై ఫోకస్ పెట్టడం లేదు..ప్రస్తుతానికి నా ఫోకస్ అంతా యాక్టింగ్పైనే ఉంది. ఆ ప్రాజెక్ట్ గురించి అంత ఎక్కువగా మాట్లాడలేనన్నాడు. అయితే ఈ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ గురించి మిమ్మల్ని సంప్రదిస్తే ఏం చెప్తారు..? అని అడిగితే సైలెన్స్‌గా ఉండిపోయాడు ప్రదీప్ రంగనాథన్.
సో ఈ లెక్కన రజినీకాంత్ -కమల్ హాసన్ సినిమాకు మరో దర్శకుడు లైన్లోకి రాబోతున్నాడని అర్థమవుతుండగా.. ఇంతకీ ఈ మల్టీ స్టారర్ మెగాఫోన్ పట్టేది ఎవరా..? అనేది తెలియాల్సి ఉంది. రజినీకాంత్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో సూపర్ ఫాంలో ఉండగా.. కమల్ హాసన్ మాత్రం చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. తలైవా ఇటీవలే కూలీ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశనే మిగిల్చింది.
The Paradise | దసరా డైరెక్టర్‌తో ‘కిల్’ రాఘవ.. నాని ది ప్యారడైజ్‌పై సూపర్ హైప్