Bigg Boss 9 | స్టార్ మాలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ రోజురోజుకీ ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటోంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ షోలో నాలుగో వారం హరిత హరీష్ ఎలిమినేట్ కావడం హౌజ్‌లోని ఇతర కంటెస్టెంట్లపై ప్రభావం చూపించింది. ప్రస్తుతం హౌజ్‌లో సంజనా, ఇమ్మాన్యుయెల్, తనూజ, భరణి, శ్రీజ దమ్ము, రీతూ చౌదరీ, కళ్యాణ్, డీమాన్ పవన్, సుమన్ శెట్టి, రాము రాథోడ్, ఫ్లోరా సైనీ, దివ్య ఉన్నారు. అయితే ఐదో వారం నామినేషన్లలో బిగ్ బాస్ ట్విస్ట్ చోటు చేసుకుంది.సోమవారం ప్రసారమైన 29వ రోజు ఎపిసోడ్లో బిగ్ బాస్ నామినేషన్లను కొత్త పద్ధతిలో నిర్వహించారు. పాత ఫార్మాట్ లో మాదిరిగా “ఒకరు ఇద్దరిని నామినేట్ చేయడం”కి బదులు, ఈసారి టాస్క్ బేస్డ్ నామినేషన్ ను ప్రవేశపెట్టారు.
రాము రాథోడ్ కెప్టెన్ కావడంతో ఆయనకు మినహాయింపు లభించింది. మిగతా అందరూ డైరెక్ట్ నామినేషన్లోకి వెళ్లారు. అయితే బిగ్ బాస్ ఒక టాస్క్ ద్వారా ఇమ్యూనిటీ సాధించే అవకాశం ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన పెద్ద బెడ్‌పై నామినేషన్లో ఉన్న వారంతా కూర్చోవాలి. ఎండ్ బజర్ మోగేంతవరకు ఎవరు బెడ్‌పైనే ఉంటారో, వారు ఇమ్యూనిటీని పొందుతారు అనే రూల్ పెట్టారు. టాస్క్ ఆరంభంలోనే సంజనా కాలు కింద పెట్టి అవుట్ అయ్యింది. అనంతరం దివ్యను బాయ్స్ టీమ్ తోసేయడంతో హౌజ్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆమె “దమ్ముంటే మిగతావారిని కూడా తోసేయండి” అంటూ సవాల్ విసరడం ఆసక్తికరంగా మారింది.
తర్వాత డీమాన్ పవన్ , రీతూ చౌదరీ , శ్రీజ ఒక్కొక్కరిగా బెడ్‌పై నుంచి కిందపడడంతో టాస్క్ మరింత హీటెక్కింది. చివరగా ఇమ్మాన్యుయెల్, భరణి, కళ్యాణ్, తనూజ మధ్య ఫైనల్ రౌండ్ లో గాలి, నిప్పు, నీరు అనే కొత్త టాస్క్ నిర్వహించారు. ఇందులోతన ఫోకస్ మరియు స్ట్రాంగ్ గేమ్‌ప్లేతో ఇమ్మాన్యుయెల్ విజేతగా నిలిచాడు. ఈ విజయంతో ఆయన ఐదో వారం నామినేషన్ నుంచి తప్పించుకున్నాడు. భరణి, సంజనా, తనూజ, ఫ్లోరా, కళ్యాణ్, డీమాన్ పవన్, రీతూ చౌదరీ, శ్రీజ, సుమన్ శెట్టి, దివ్య ప్రస్తుతం నామినేషన్లో ఉండగా, వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. టాస్క్‌ల అనంతరం హౌజ్‌లో ఎమోషనల్ మూమెంట్స్ చోటుచేసుకున్నాయి. టాస్క్‌లో తనకు సపోర్ట్ చేస్తారని భావించిన కళ్యాణ్, ఇమ్మాన్యుయెల్ హ్యాండిచ్చారని రీతూ బాధపడింది. “ఇక ఎవరినీ నమ్మొద్దు… ఎవరి గేమ్ వాళ్లే ఆడాలి” అంటూ ఆమె ఎమోషనల్ అయ్యింది. దివ్య కూడా తన భావాలను బయటపెట్టింది. భరణి నా కోసం నిలబడతాడని అనుకున్నా, కానీ తోసేసేటప్పుడు అడ్డుకోలేదు అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.మరోవైపు భరణి కూడా కొంతమంది కంటెస్టెంట్ల విమర్శలను ఎదుర్కొన్నారు. మంచి వాడిలా నటిస్తున్నావు అంటూ రీతూ, ఇతరులు ఆయనను నిలదీశారు.