The Paradise | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో నటిస్తోన్న చిత్రం ది ప్యారడైజ్ (THE PARADISE). ఈ చిత్రంలో మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తుండగా.. ఇటీవలే విడుదల చేసిన లుక్ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఈ మూవీని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లో దసరా ఫేం సుధాకర్ చెరుకూరి తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
కిల్ యాక్టర్ రాఘవ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ది ప్యారడైజ్‌లో భాగం కావడం పట్ల ఎక్జయిటింగ్‌కు లోనవుతున్నాడు రాఘవ. శ్రీకాంత్ ఓదెల రాఘవతో స్కిప్ట్ డిస్కషన్స్‌లో పాల్గొన్నాడని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. ఈ సందర్భంగా శ్రీకాంత్ ఓదెల-రాఘవ కలిసి దిగిన ఫొటో ఒకటినెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
తాజా టాక్ ప్రకారం త్వరలోనే రాఘవ పోర్షన్‌కు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేయబోతున్నారట. ది ప్యారడైజ్ పాన్ ఇండియా సినిమా కాదని.. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అని అంటున్నాడు రాఘవ. ఈ చిత్రాన్ని 2026 మార్చి 26న ప్రధాన భారతీయ భాషలతోపాటు ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.
చరిత్రలో అందరూ చిలకలు..
వైల్డ్ రైడ్ ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ విడుదల చేసిన The Paradise Glimpseలో.. చరిత్రలో అందరూ చిలకలు, పావురాల గురించి రాసిర్రు కానీ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలే. ఇది కడుపు మండిన కాకుల కథ. జమానా జమానాకెళ్లి నడిచిన శవాల కథ. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఓ జాతి కథ.. నా కొడుకు నాయకుడైన కథ.. అంటూ డార్క్ షేడ్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతున్న డైలాగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
హింస, రక్తపాతం, తుపాకులు, గ్లోరీ, ఒక మనిషి.. అంటూ షేర్ చేసిన లుక్‌లో నాని రెండు జడలు, సిక్స్ ప్యాక్ బ్యాడీ, గన్స్‌తో కనిపిస్తూ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాడు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఓ వైపు బ్లాక్ బస్టర్ దసరా కాంబో కావడం, మరోవైపు నాని-అనిరుధ్ కాంబోలో జెర్సీ, గ్యాంగ్ లీడర్ తర్వాత వస్తున్న సినిమా అవడంతో ది ప్యారడైజ్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి.