Power Cuts | హత్నూర, ఏప్రిల్ 12 : ఓ వైపు మండుతున్న ఎండలు.. మరోవైపు కరెంట్ కోతలతో ప్రజలు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నిత్యం కరెంటు కోతలు విధిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వేసవికాలం కావడంతో ఎండలు మండిపోతుంటే.. మరోవైపు కరెంటు కోతలతో తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు.
మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో చల్లనిగాలి కోసం ఇండ్లల్లో కూలర్లు, ఫ్యాన్ల కింద సేదతీరే ప్రజలు ఒక్కసారిగా కరెంటు కోతలు విధిస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నట్లు వాపోతున్నారు.
అంతేకాకుండా చిన్నపాటి ఈదురుగాలులు వచ్చినా గంటల తరబడి కరెంటు కట్ చేస్తున్నారని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ బోర్లకు సరఫరా అయ్యే కరెంటు సైతం అడపాదడపా కట్ చేస్తుండటంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంట్ కోతలు ఎలా ఉన్నాయో తాజా వార్తలు మరోసారి రుజువు చేస్తున్నాయి.
Ramakrishna Math | రామకృష్ణ మఠంలో వేసవి శిక్షణా శిబిరాలు
padi koushik reddy | బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
Mutton | మటన్‌ను ఎంత మోతాదులో తింటే మంచిది..? ఈ లిమిట్ దాటితే కష్టమే..!