Ramakrishna Math | కవాడిగూడ, ఏప్రిల్ 12 : రామకృష్ణ మఠంలో వేసవి శిక్షణా శిబిరాలకు అడ్మిషన్లు జరుగుతున్నాయని రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద తెలిపారు. నాలుగవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులకు వేర్వేరుగా శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. అడ్మిషన్ కావాలనుకునే వారు తమ చిన్నారుల స్కూల్ ఐడెంటిటీ కార్డుతో రామకృష్ణ మఠంలోని వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్లెన్సీ కార్యాలయంలో సంప్రదించాలని స్వామీ బోధమయానంద తెలిపారు. ఏడవ తరగతి విద్యార్థులకు ఈ నెల 28 నుంచి మే 11వరకు అదేవిధంగా 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మే 12 నుంచి 25 వరకు సంస్కార్ పేరిట వేసవి విద్యాశిబిరాలను నిర్వహిస్తామన్నారు.
ధ్యానము, యోగాసనాలు, నైతిక విలువలకు సంబంధించిన అంశాలపై శిబిరంలో విద్యార్థులకు నిపుణులతో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని స్వామీజీ తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ నెల 14 నుంచి 24 వరకు శ్రద్ద పేరిట వ్యక్తిత్వ వికాస శిబిరాన్ని నిర్వహిస్తామన్నారు. ఇందులో ధ్యానము, యోగాసనాలతో పాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, నైతిక అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. మరింత సమాచారం కోసం 040 27627961 లేదా 9177232696 నంబర్లలో సంప్రదించాలని స్వామీ బోధమయానంద సూచించారు.