padi koushik reddy | హుజూరాబాద్, ఏప్రిల్ 12 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న అతి పెద్ద ఎత్తున జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హుజురాబాద్ పట్టణంలో భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభ ప్రచార పోస్టర్ను స్థానిక పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే శనివారం ఆవిష్కరించారు.
అనంతరం హుజురాబాద్ పట్టణంలోని ముఖ్య కూడళ్లలో గోడలపై పోస్టర్లను అంటించారు, సభ అపూర్వ విజయాన్ని సాధించాల్సిన లక్ష్యంతో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభను విజయవంతం చేసేందుకు అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలని సూచించారు.