ఎండాకాలం జర భద్రం.. ముదురుతున్న ఎండలు
ఎండాకాలంలో ఆరోగ్య సంరక్షణపై జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా జబ్బుల బారిన పడే అవకాశాలు మెండుగా ఉంటాయి. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రత రోజురోజుకు అధికంగా నమోదు అవుతోంది. ఇప్పుడే ఈ తీరుగా ఎండలు మండిపోతుంటే మరో రెండు నెలలు వేసవి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
- పొంచి ఉన్న వ్యాధులు
- జాగ్రత్తలు పాటిస్తే మేలు
నేరేడుచర్ల, మార్చి 10 : ఎండాకాలంలో ఆరోగ్య సంరక్షణపై జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా జబ్బుల బారిన పడే అవకాశాలు మెండుగా ఉంటాయి. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రత రోజురోజుకు అధికంగా నమోదు అవుతోంది. ఇప్పుడే ఈ తీరుగా ఎండలు మండిపోతుంటే మరో రెండు నెలలు వేసవి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎండలో తిరగడం వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఆకస్మికంగా పెరిగే ఉష్ణొగ్రత వల్ల జ్వరాలు ప్రబలుతాయి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలకు చికెన్‌పాక్స్ వ్యాధి సోకుతుంది. కల్తీ నూనె, కలుషిత నీటి వల్ల పచ్చకామెర్లు, డయేరియా వ్యాపిస్తుంది. వేసవిలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తుల తీసుకోవడంతో వేసవిని సంతోషంగా సాగనంపొచ్చు. ఎండాకాలంలో వచ్చే వ్యాధులు, ఆరోగ్య సంరక్షణపై వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.
పచ్చకామెర్లు
నూనె, కలుషిత పానీయాలు, ఆహారంతో పచ్చకామెర్ల వ్యాధి బారిన పడతారు. కల్తీ నూనెలతో తయారు చేసిన వంటకాలను భూజించడం, ఆపరిశుభ్రంగా ఉన్న హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో అమ్మకాలు జరిపే పదార్థ్ధాలు తినడం వల్ల పచ్చకామెర్ల వ్యాధి వస్తుంది. తద్వారా కాలేయం పాడైపోయి ఆకలి సన్నగిల్లుతుంది. ఈ వ్యాధి సోకిన వెంటనే చికిత్స చేయించుకోవాలి. లేకపోతే ఒక్కోసారి ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుంది.
వ్యాధి లక్షణాలు
పచ్చకామెర్ల వ్యాధి బారిన పడిన వెంటనే వ్యక్తి కండ్లు పచ్చగా మారుతాయి. మూత్రం పచ్చగా వస్తుంది. ఆకలి పూర్తిగా తగ్గిపోతుంది. రోజులు గడుస్తున్న్న కొద్దీ శరీరం పూర్తిగా నీరసించిపోతుంది. రోజుల తరబడి జ్వరం వస్తుంది. శరీరంలోని కళ్లు, నోరు, నాలుక కింద భాగం పచ్చగా మారుతాయి. కొందరికి వాంతులు అవుతాయి. కాలేయ పరిమాణం పెరగడం వల్ల కడుపులో నొప్పి వస్తుంది.
జాగ్రత్తలు
పచ్చకామెర్లు దరి చేరకుండా ఉండాలంటే కనీస నియామలు పాటించాలి. కలుషిత ఆహారం తీసుకోవద్దు. కాచి వడపోసిన గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాలి. హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో తిండిన గణనీయంగా తగ్గించాలి. సాధ్యమైనంత వరకు ఇంట్లో తయారు చేసిన వంటలను ఆహారంగా తీసుకోవడం శ్రేయస్కరం.
కలుషిత నీటితో అతిసార
వేసవిలో అతిసారం తీవ్రంగా ప్రబలే అవకావాలు ఉంటాయి. ఆహార పదార్థ్దాలు, నీరు కలుషితం కావడం వల్ల అతిసార బారిన పడే అవకాశాలుంటాయి. అతిసార, నీళ్ల విరోచనాలు కలుగుతాయి. బ్యాక్టీరియా, వైరస్ వల్ల కూడా అతిసారం బారిన పడతారు.
లక్షణాలు
అతిసార వ్యాధి బారిన పడగానే విరోచనాలు అవుతాయి. తరచూ నీళ్ల విరోచనాలు కావడం వల్ల వ్యక్తి త్వరిగతిని నీరసించిపోతాడు. వాంతులు అవుతాయి. మూత్రం సరిగా రాకపోవడం, కొన్ని సందర్భాల్లో పూర్తిగా మూత్రవిసర్జన జరగకపోవడం, మరికొన్ని సందర్భాల్లో మూత్రం మంటగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలోని లవణాలు విసర్జించడం వల్ల నీరసం కలుగుతుంది.
జాగ్రత్తలు
అతిసార వ్యాది, నీళ్ల విరోచనాల బారిన పడకుండా జగ్రత్త వహించాలి. కలుషిత నీరు, పానీయాలను ఎట్టి పరిస్థిల్లోనూ తీసుకోవద్దు. నీటిని మరగించి, కాచి, వడపోసిన తర్వాతనే తాగాలి. కుండలో రోజుకు మించి నిల్వ ఉన్న నీటిని తాగకపోవడం మంచిది. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలి. మలమూత్ర విసర్జన తర్వాత చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
చికెన్‌ఫాక్స్
చిన్నపిల్లలకు చికెన్‌ఫాక్స్ వేగంగా వ్యాప్తిసుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలకు వ్యాధి సంక్రమిస్తుంది. ఎరిపిన్, వ్యారిసెల్లా వైరస్ మూలంగా చికెన్‌ఫాక్స్ వ్యాపిస్తుంది. వైరస్ ద్వారా ఈ వ్యాది వేగంగా వ్యాప్తి చెందుతుంది. వయోభేదం లేకుండా ఈ వ్యాధి ఎవరికైనా సోకుతుంది. గాలి ద్వారా వేగంగా సంక్రమించే ఈ వ్యాధిని పల్లెలో పోశమ్మతల్లి, అమ్మతల్లి పేరుతో పిలిస్తుంటారు. ఈవ్యాధి సోకిన తర్వాత కలిగే ఇన్ఫెక్షన్ తీవ్రరూపం దాల్చితే న్యూమోనియా, మెదడువాపు బారిన పడతారు. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కూడా ఉత్పన్పమవుతాయి.
లక్షణాలు
చికెన్‌ఫాక్స్ వల్ల వ్యక్తి శరీరంలో దద్దులు, పొంగులు వస్తాయి. క్రమేపీ దద్దులు పెద్దవిగా మారుతాయి. జ్వరం తీవ్రత ఉంటుంది. గొంతునొప్పి, దగ్గు, జలుబు లక్షణాలు బయటపడతాయి. నిర్లక్ష్యం చేస్తే పేగు, అన్నవాహికల్లో కూడా దద్దులు వచ్చే అవకాశం మెండుగా ఉంటాయి.
జాగ్రత్తలు
చికెన్‌ఫాక్స్ సోకిన వ్యక్తిని వీలైనంత మేరకు గదిలో నుంచి బయటకు రానివ్వకుండా చూడాలి. సాధ్యమైనంత వరకు వ్యాధిగ్రస్తులను వేరుగా ఉంచడం శ్రేయస్కరం. ఈ వ్యాధి గాలిద్వారా సోకుతుంది. శరీరంపై వచ్చిన దద్దులు, పొంగులు దురదపెడతాయి. వీటిని గోళ్లతో గిల్లకుండా ఉండడం మంచిది. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడని సంప్రదించాలి. వైద్యుడు సూచించిన సూచనలు, సలహాలు పాటించాలి. వ్యాధిగ్రస్తులు వాడిన వస్తువులను మరొకరు వినియోగించొద్దు.
హిట్ పెరాక్సియా
ఎండాకాలంలో హిట్పెరాక్సియా జ్వరం ఎక్కువగా ప్రబలుతుంది. వాతావరణంలో ఆకస్మికంగా సంభవించే మార్పుల వల్ల ఉష్ణోగ్రత పెరగడంతో హిట్పెరాక్సియా జ్వరం వస్తుంది. సాధారణంగా మానవ శరీరం 80 డిగ్రీల ఉష్ణోగ్రతను మాత్రమే తట్టుకుంటుంది. వేసవిలో వడగాలులు తీవ్రంగా వీస్తాయి. ఈ కారణంగా హిట్పెరాక్సియా త్వరితగతిన ప్రబలే అవకాశాలు ఉంటాయి.
లక్షణాలు
ఒంట్లో ఆకస్మికంగా ఉష్ణోగ్రత పెరగడం వల్ల జ్వరం వస్తుంది. కండ్లు మండటం, తలనొప్పి రావడం, కండ్లు తిరగడం, మూత్రం పోస్తున్నప్పుడు మంట ఏర్పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
జాగ్రత్తలు
- సాధ్యమైనంత వరకు జ్వరం సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
- మధాహ్న సమయంలోఎండలో తిరగొద్దు
- అత్యవసర పనిమీద తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే ఉదయం, సాయంత్రం పూట మాత్రమే వెళ్లాలి.
- రసాయనాలతో తయారు చేసే శీతలపానీయాలను సేవించాలి
- కొబ్బరినీళ్లు తీసుకోవడంతో ప్రయోజనం ఉంటుంది
- ఎండలో వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత నీరసంగా అనిపిస్తే గోరువెచ్చని నీటిలో ఓఆర్ఎస్ ద్రావణం కలిపి తాగాలి.
- తద్వారా ఉపశమనం కలిగి మానసిక ప్రశాంతంగా చేకూరుతుంది.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

