Palle Pragathi | సిర్గాపూర్ మండలం పెద్ద ముబారక్ పూర్ గ్రామంలో పల్లె ప్రగతి ట్రాక్టర్ రిపేరుకు నోచుకోక మూలకు చేరింది. దాంతో గ్రామంలో చెత్త సేకరణ నిలిచిపోయి, అది దిష్టిబొమ్మలా మారింది. గత కొన్ని నెలల కిందట ట్రాక్టర్ చెడిపోగా, దీన్ని రిపేర్ చేయించే నాథుడే కరువయ్యారని స్థానికులు తెలిపారు.
గ్రామంలో పారిశుద్ధ్య పనులు, చెత్త సేకరణ, ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా, అవెన్యూ ప్లాంటేషన్ కు నీటి తడులు అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్‌ను కేటాయించారు. అయితే వీటికి బాధ్యత వహించే సర్పంచులు లేక ప్రత్యేక అధికారుల పాలన దిగజారుతోందని స్పష్టంగా తెలుస్తుంది.
ట్రాక్టర్ మరమ్మతు చేయించాలని సంబంధిత పంచాయతీ సెక్రటరీకి తెలిపిన పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. ఏ అధికారి కూడా స్పందించకపోవడంతో ట్రాక్టర్ నిరుపయోగంగా మూలన పడినట్లు చెప్పారు. దీంతో గ్రామంలో చెత్త సేకరణ నిలిచి, ఇక్కడ పడితే అక్కడ చెత్త చెదారంతో వీధులు కంపు కొడుతున్నాయని చెప్పారు.
ప్రస్తుత ప్రభుత్వంలో గ్రామపంచాయతీకి తగినన్ని నిధులు కూడా మంజూరు లేక గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పల్లె ప్రగతి ట్రాక్టర్‌కు మరమ్మత్తులు తీసి ఉపయోగంలోకి తేవాలని కోరుతున్నారు.
ఈ విషయమై మండల పంచాయతీ అధికారి బ్రహ్మయ్యను విచారించగా.. పంచాయతీలో తగినన్ని నిధులు లేక రిపేర్ చేయలేదన్నారు. నిధుల మంజూరు కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదించినట్లు చెప్పారు.
Sim Card | మీ పేరుతో ఎవరైనా సిమ్‌కార్డు తీసుకున్నారా..? ఎలా తెలుసుకోవాలంటే..?
RFCL | కోలుకుంటున్న ఆర్ఎఫ్సీఎల్ బాధితుడు.. అప్రమత్తతతోనే తప్పిన అగ్ని ప్రమాదం
Free medical camp | దయానంద విద్యా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం