Congress govt | అస్మదీయులకు అభయ‘హస్తం’ పేదలకు మొండి‘చెయ్యి’..ఇదీ కాంగ్రెస్ భూబాగోతం
నిరుపేదలకు సెంటు భూమి లేదంటున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తమ అస్మదీయులకు మాత్రం రాత్రికిరాత్రి వేల కోట్ల విలువైన భూములను కట్టబెడుతున్నదనేందుకు ఇదే నిదర్శనం.
- నిరుపేదలకు సెంటు జాగ లేదు..
- అస్మదీయులకు వేలకోట్ల భూములు ధారాదత్తం
- ఖజానాలోనూ నయాపైసా లేదంటూ పదేపదే బీద అరుపులు
- నియోపొలిస్‌లో క్రషర్కు పదెకరాల భూమి కేటాయింపు
ఎస్సీలు, ఎస్టీలు తమ ప్రభుత్వం భూములు ఇస్తుందనే ఆశలు పెట్టుకోవద్దు.. అసలు ప్రభుత్వం దగ్గర భూములే లేవు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఒక సమావేశంలో చేసిన ప్రకటన.
కోకాపేటలోని నియోపొలిస్ లేఅవుట్లో సీఎం రేవంత్‌రెడ్డి అల్లుడికి పదెకరాలను ధారాదత్తం చేసి అందులో క్రషర్, రెడీమిక్స్ ప్లాంటు ఏర్పాటు చేశారు. శనివారం శారదా పీఠం దగ్గర మాజీ మంత్రి హరీశ్‌రావు బట్టబయలు చేసిన భూబాగోతం.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): నిరుపేదలకు సెంటు భూమి లేదంటున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తమ అస్మదీయులకు మాత్రం రాత్రికిరాత్రి వేల కోట్ల విలువైన భూములను కట్టబెడుతున్నదనేందుకు ఇదే నిదర్శనం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2021లో రూపుదిద్దుకున్న కోకాపేట నియోపొలిస్ రియల్ ఎస్టేట్ రంగంలో చరిత్రను సృష్టించింది. 2021లో నిర్వహించిన వేలంలో ఇక్కడ ఏకంగా ఎకరా రూ.100 కోట్ల ధర పలికింది. అలాంటి భూములను రాష్ర్టాభివృద్ధికి వినియోగించాల్సిందిపోయి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అస్మదీయులకు కట్టబెట్టడం ఆందోళనకర పరిణామం. నియోపొలిస్ లేఅవుట్లో సెజ్ కోసం కేటాయించిన భూముల్లో పదెకరాల భూమిని భాగ్యలక్ష్మీ మైన్స్ అండ్ మినరల్స్‌కు కేటాయించారు. కానీ ఎక్కడా ఇది అధికారిక వెబ్సైట్లలో నమోదు చేయలేదు. ఉమ్మడి ఏపీతోపాటు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కూడా జరిగిన నాలుగైదు కేటాయింపులు ఇప్పటికీ హెచ్ఎండీఏ వెబ్సైట్లో దర్శనమిస్తున్నాయి.
కానీ మా జీ మంత్రి హరీశ్‌రావు చెబుతున్నట్టు గత ఏడాది సీఎం అల్లుడి కోసం చేసిన పదెకరాల కేటాయింపును మాత్రం వెబ్సైట్లో నమోదు చేయలేదు. తాము కేవలం క్రషర్, రెడీమిక్స్ ప్లాంటుకే అనుమతులు ఇచ్చామని, భూ కేటాయింపు మాత్రం హెచ్ఎండీఏ చేసిందని గనుల శాఖ చెప్తున్నది. కానీ 17-20 ఎకరాల భూమి సదరు కంపెనీ ఆధీనంలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ కంపెనీ డైరెక్టర్లుగా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ఉండగా.. ఈ గ్రూపు పేరిట ఫార్మా, మైనింగ్ రంగంలో పలు కంపెనీలు నమోదై ఉన్నాయి. నియోపొలిస్‌లో ఈ రెడీమిక్స్ ప్లాంటు ఏర్పాటయ్యే వరకు భూము లు దక్కించుకున్న కంపెనీలు నిర్మాణాల కోసం సొంతంగా రెడీమిక్స్ ప్లాం ట్లను తమ భూముల్లోనే ఏర్పాటు చేసుకున్నాయి. కానీ ఇది ఏర్పాటైన తర్వాత ఈ సంస్థ ద్వారానే ఆర్ఎంసీ కొ నాలని అనధికారికంగా హుకుం జారీఅయినట్టు సమాచారం. దీంతో బడా కంపెనీలు యోపొలిస్ వెంచర్ పరిధిలో కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేయకుండా నియంత్రిస్తున్నారు.
భూమి విలువ పదివేల కోట్లకు పైనే
నియోపొలిస్‌లో కేసీఆర్ ప్రభుత్వ హయాం లో ఎకరా రూ.100 కోట్ల వరకు ధర పలికితే… ఇదే లేఅవుట్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన వేలంలో అంతకుమించిన ధర పలికింది. అంటే భాగ్యలక్ష్మీ మైన్స్ అండ్ మినరల్స్‌కు కేటాయించిన పదెకరాల విలువ రూ.పది వేల కోట్లకు పైగానే ఉంటుంది. ఈ పదెకరాల భూమిని హెచ్ఎండీఏ ఏ ప్రాతిపదికన లీజుకు ఇచ్చింది? ఎంత ధర నిర్ణయించారు? అన్నది బయటపెట్టలేదు. ఇక్కడి భూములను కంపెనీలకు కేటాయించడంతోపాటు వేలం ద్వారా ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చారు. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొత్తగా లీజు ప్రాతిపదికన పదెకరాలను కేటాయించడమంటే నిబంధనలకు పాతరేశారనే ఆరోపణలు ఉన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS Govt
- Crusher
- HMDA website
- land
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

