Sim Card | చేర్యాల, మే 15 : ఒక వ్యక్తి తన పేరుతో ఎన్ని మొబైల్ సిమ్‌కార్డులు ఉన్నాయి. గతంలోనే తన పేరిట ఎవరైనా సిమ్‌కార్డు తీసుకున్నారనే అనుమానం అప్పుడప్పుడు తలెత్తుంటుంది. ఈ క్రమంలో మీ పేరుతో ఎవరైనా సిమ్‌కార్డు తీసుకున్నారనేది తెలుసుకోవాలో అందరికి అవగాహన ఉండదు.
నేటి ఇంటర్నెట్ ప్రపంచంలో రోజుకో మోసం వెలుగు చూస్తూనే ఉంది. అయితే మీ ఐడీ కార్డులతో ఎవరైనా సిమ్ తీసుకున్నారనే అనుమానం మీకు ఉందా… ? మీ పేరు మీద ఎన్ని సిమ్‌కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయి ? అనే విషయాన్ని తెలుసుకోవడానికి టెలికాం విభాగం ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. ఈ పోర్టల్ ద్వారా మీ పేరు మీద ఎవరైనా ఫేక్ సిమ్ తీసుకుంటే మీరే బ్లాక్ చేసేందుకు అవకాశం కూడా కల్పించింది.
అది ఎలాగంటే..
*ముందుగా మీరు ప్రభుత్వ పోర్టల్ https://tafcop.dgtelecom.gov.in/alert.phpలోకి వెళ్లాలి
*అక్కడికి వెళ్లగానే మొదట మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి.
*అప్పుడు మీ పేరు మీద యాక్టివ్‌గా ఉన్న మొబైల్ నెంబర్లు కనిపిస్తాయి.
*మీకు కనిపించే వాటిలో మీకు తెలియని నెంబర్ ఏదైనా ఉంటే దానిపై క్లిక్ చేసి బ్లాక్ చేయమని రిక్వెస్ట్ పెట్టాలి
*ఇలా రిక్వెస్ట్ పెట్టిన తర్వాత టెలికాం సంస్ధ రిక్వెస్ట్ ఐడీని కంప్లైంట్ ఇచ్చిన వినియోగదారుడికి పంపిస్తుంది. ఆ ఐడీ ద్వారా మీ రిక్వెస్ట్‌ను ట్రాక్ చేయవచ్చు. దీంతో మీ ఐడీతో ఎవరైనా సిమ్ కార్డు తీసుకుని ఉపయోగిస్తే వాటిని బ్లాక్ చేయించవచ్చు.
Sunitha Lakshma Reddy | కాంగ్రెస్ సర్కార్‌ను నమ్మని ప్రజలు, రైతులు: ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Kidnap | మామడ మాజీ ఎంపీపీ కిడ్నాప్.. తూప్రాన్ టోల్గేట్ వద్ద తప్పించుకున్న హరీశ్
MRPS | ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలి