దోమ, జూన్ 15 : ఎమ్మార్పీఎస్ 31 ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని దోమ మండలం ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షుడు బొంపల్లి వెంకటేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ నాయకులు దోమ మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణకు దిమ్మెలను సిద్ధం చేయాలన్నారు.
జులై 7 న ఆవిష్కరణ నిర్వహించాలని మండల ఉపాధ్యక్షుడు బొంపల్లి వెంకటేష్ పిలుపునిచ్చారు. ఆయా గ్రామాలలోని ఎమ్మార్పీఎస్ నాయకులు గ్రామస్తుల సమన్వయంతో జెండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.