నిర్మల్: నిర్మల్ జిల్లాలో మాజీ ఎంపీపీ కిడ్నాప్ కలకలం రేపింది. మామడ మండల మాజీ ఎంపీపీ, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్, బీఆర్ఎస్ నాయకుడు చిక్యాల హరీశ్ కుమార్‌ను దుండగులు కిడ్నాప్ చేశారు. శనివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో పొన్కల్‌లోని హరీశ్ నివాసానికి కారులో వచ్చిన గుర్తుతెలియని వక్తులు.. అతడిని బలవంతంగా తీసుకెళ్లారు. ఈ క్రమంలో మెదక్ జిల్లా తూప్రాన్ టోల్గేట్ వద్ద చాకచక్యంగా తప్పించుకున్న హరీశ్ పోలీసులను ఆశ్రయించారు. కిడ్నాప్‌పై మామడ పోలీసులకు తూప్రాన్ పోలీసులు సమాచారం అందించారు. ఆయనను నిర్మల్‌కు తీసుకు వచ్చిన తర్వాత వివరాలు వెల్లడించనున్నారు.