జోగులాంబ గద్వాల : గద్వాల పట్టణం వేద నగర్లోని దయానంద విద్యా సమితిలో (Dayananda Vidya Samithi) ఆదివారం ఉచిత వైద్య సేవ ( Free Medical Service) కార్యక్రమాన్ని నిర్వహించారు. తలమర్ల మోహన్ రెడ్డి( యూఎస్ఏ), పాఠశాల కార్యదర్శి బండ్ల నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఉచిత వైద్య సేవ అందిస్తున్నట్లు దయనంద సమితి నిర్వాహకులు తెలిపారు.
వైద్యులు దామ వంశీ, పి మానసవీణ రోగులను పరీక్షించారు. బీపీ, షుగర్ పరీక్షలు చేసి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. దాదాపు120 మందికి పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని, దోమలు రాకుండా పలు ఏర్పాట్లు చేసుకోవాలని వైద్యులు సూచించారు.
సీజనల్ వ్యాధులకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ దామ వంశీ తెలిపారు.ఈ కార్యక్రమం లో దయానంద విద్యాసమితి కార్యదర్శి బండ్ల నాగేశ్వర్ రెడ్డి, కరస్పాండెంట్ పుట్టా శ్రీనివాస్ ఆర్య , ప్రిన్సిపాల్ హరినాథ్ రెడ్డి ,సమన్వయకర్త మనోజ్ దోత్రే , రామచంద్ర సఫారీ, ఫార్మాసిస్ట్ జేరుబండి వినయ్ , పబ్బతి సుధాకర్, నరేంద్ర గణపతి తదితరులు పాల్గొన్నారు .