Drinking Water | ఝరాసంగం, ఏప్రిల్ 22 : ఎండాకాలం అంటే నీటి ఎద్దడి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతీ చుక్క నీరును జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖర్చుతో ప్రజల దాహం తీర్చేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. తాగునీరు వృథాగా పోతున్నా అధికారుల తీరు మాత్రం ఇవేవి పట్టనట్టుగా ఉంది.
అసలే ఎండాకాలం రోజురోజుకు ఎండలు తీవ్రతరం అవుతుండటంతో దాహార్తి తీర్చుకునేందుకు ప్రజలు నానా అవస్థలకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ అవడంతో నీరు బయటకు చిమ్ముతూ వృథాగా పోతోంది. ఝరాసంగం మండల పరిధిలోని బర్దిపూర్ గ్రామ శివారులో రోడ్డు పక్కల భగీరథ పైప్ లైన్ వాల్ లీకేజీ ఏర్పడడంతో సోమవారం రాత్రి నుంచి నీరు పైకి ఎగజిమ్ముతూ నేలపాలవుతుంది. మొన్నటి వరకు మిషన్ భగీరథ కార్మికులకు ప్రభుత్వం నెలనెలా వేతనాలు చెల్లించకపోవడంతో నిరసన తెలిపి విధులకు రాకుండా స్ట్రైక్ చేయడంతో ప్రజలు బిందెడు నీళ్ల కోసం గ్రామాల సమీపంలోని వ్యవసాయ బోరు బావుల వద్దకు వెళ్లి తాగునీరు తెచ్చుకున్నారు.
ఇప్పుడు మిషన్ భగీరథ పైప్లైన్ వాల్స్ లీకేజీతో వృథాగా నీరు పోతుంది. ఇంటింటికీ తాగునీరందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖర్చుతో తీసుకువచ్చిన మిషన్ భగీరథ పథకంపై అధికారుల పర్యవేక్షణ కరువైందని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి పైప్ లైన్ కు ఏర్పడిన లీకేజీని బాగుచేయించాలని.. వృథాగా పోతున్న నీటిని కోరుతున్నారు.
Prayag ManZhi | తనపై కోటి రూపాయల రివార్డ్ ఉన్న మావోయిస్టు మాంఝీ ఎన్కౌంటర్లో మృతి
Road Accident | నెలాఖరులో పదవీ విరమణ..అంతలోనే రోడ్డుప్రమాదం.. ఘటనలో హెడ్మాస్టర్ దుర్మరణం